fbpx
HomeMovie Newsకొరియన్ రీమేక్ లో 'నివేతా- రెజీనా'

కొరియన్ రీమేక్ లో ‘నివేతా- రెజీనా’

SudheerVarma Koriyan Remake

టాలీవుడ్: ఇండస్ట్రీ లో ఇపుడు రీమేక్ ల హవా నడుస్తుంది. పక్క రాష్రాల భాషలే కాకుండా కొరియన్ సినిమాలు కూడా మన నేటివిటీ కి తగ్గట్టుగా రీమేక్ చేస్తున్నారు. కొరియన్ భాషలో రూపొందిన ‘మిస్ గ్రానీ’ సినిమాని బేస్ చేసుకుని నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ముఖ్య పాత్రలో ‘ఓ బేబీ’ సినిమాని రూపొందించి హిట్ కొట్టారు సురేష్ ప్రొడక్షన్స్. ఇపుడు మరో కొరియన్ సినిమాని రీమేక్ చేస్తున్నారు. స్వామి రారా సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యి ‘దోచేయ్’, ‘కేశవ’,’రణరంగం’ లాంటి థ్రిల్లర్ మరియు యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలని రూపొందించిన సుధీర్ వర్మ మొదటి సారి రీమేక్ చేయనున్నాడు. కొరియన్ లో రూపొందిన ‘మిడ్ నైట్ రన్నర్స్’ అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

ఈ సినిమాలో రెజీనా మరియు నివేత థామస్ నటిస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ ‘మిడ్ నైట్ రన్నర్స్’ లో ఇద్దరు హీరో పాత్రలు ఉంటాయి. తెలుగు కి వచ్చే సరికి కొంచెం మార్చి ఆ పాత్రల్ని ఇద్దరు హీరోయిన్ లతో చేస్తున్నారు. ఈ సినిమా గురించి చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ అధికారిక ప్రకటన లేదు. ఈ రోజు సురేష్ ప్రొడక్షన్స్ అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. గురు ఫిలిమ్స్, క్రాస్ ఫిలిమ్స్ తో ‘ఓ బేబీ’ సినిమాని రూపొందించిన సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాకి కూడా వారి బాగస్వామ్యంలోనే రూపొందిస్తుంది. థ్రిల్లర్ జానర్ లో రూపొందనున్న ఈ సినిమాని త్వరగా పూర్తి చేసి ఓటీటీ లో విడుదల చేసే అవకాశకు ఎక్కువగా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular