fbpx
HomeMovie Newsసందీప్ కిషన్ 'రౌడీ బేబీ' లాంచ్

సందీప్ కిషన్ ‘రౌడీ బేబీ’ లాంచ్

SandeepKishan RowdyBaby ShootingStarted

టాలీవుడ్: ధనూష్, సాయి పల్లవి జంటగా నటించిన ‘మారి 2 ‘ సినిమా నుండి ‘రౌడీ బేబీ’ పాట ఎంత ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలిసిన విషయమే, ఇపుడు అదే పాట లిరిక్ ని టైటిల్ గా పెట్టి మన ముందుకు రాబోతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో ‘సందీప్ కిషన్‘. చాలా రోజులుగా సక్సెస్ కోసం దండయాత్ర చేస్తున్న హీరోల్లో సందీప్ కిషన్ ఒకడు. ఒక దాని తర్వాత ఒకటి వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు కానీ సూపర్ హిట్ సినిమా ఐతే ‘వేంకటాద్రి ఎక్స్ప్రెస్’ కాకుండా ఇంకా ఏమీ తగలలేదు. చేస్తున్న సినిమాలు ప్లాప్ గానో, యావరేజ్ గానో ఆడి పోతున్నాయి కానీ మంచి సక్సెస్ అనుకున్న సినిమా ఐతే సందీప్ కెరీర్ లో తగలట్లేదు.

ఈరోజు వైజాగ్ లో రౌడీ బేబీ సినిమా లాంఛనంగా ప్రారంభం అయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి రైటర్ గా పేరున్న కోన వెంకట్ ప్రొడక్షన్ హౌస్ లో ఈ సినిమా నిర్మితమవుతుంది . జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో సందీప్ కి జోడీ గా నేహా శెట్టి అనే కొత్త అమ్మాయి నటిస్తుంది. ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నాడు. మరో ముఖ్య పాత్రలో తమిళ నటుడు బాబీ సింహ కూడా నటిస్తున్నాడు. చౌరస్తా రామ్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నాడు. ఈ సినిమాతో పాటు ఇండియన్ నేషనల్ స్పోర్ట్ ‘హాకీ’ బ్యాక్ డ్రాప్ తో ‘A1 ఎక్స్ప్రెస్’ అనే సినిమాని కూడా సందీప్ కిషన్ చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular