fbpx
HomeMovie Newsసాయి ధరమ్ తేజ్ 108 సోలో శ్లోకాలు

సాయి ధరమ్ తేజ్ 108 సోలో శ్లోకాలు

PhilosophyOfVirat SoloBrathukeSoBetter Movie

టాలీవుడ్: టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’. టైటిల్ కి తగ్గట్లే ఈ సినిమాలో మొదట సోలో గా ఉండాలి సోలోగానే ఉండాలి అంటూ నినాదాల్ని పలుకుతూ కొన్ని శ్లోకాలు రాసి ఒక పుస్తకం కూడా విడుదల చేస్తాడు. ఆ పుస్తకాన్ని చూపిస్తూ అందులో ఉన్న శ్లోకాల్ని పలుకుతూ ఉంది ఫిలాసఫీ ఆఫ్ విరాట్ అని ఒక వీడియో విడుదల చేసారు మేకర్స్. శ్లోకం నెంబర్ అని చెప్తూ 108 శ్లోకాల్లోంచి మధ్య మధ్యలో కొన్ని శ్లోకాలు వినిపిస్తూ వీడియో ముగించేశారు. ‘ఏప్రిల్ ఫస్ట్ కి ఫూల్స్ డే అని తెలిసి కూడా ఫూల్ అయ్యేవాడు.. ప్రతిరోజూ ఫూల్ అవుతాడని తెలిసి కూడా పెళ్ళి చేసుకునే వాడు.. ఈ చరిత్రలో సుఖపడినట్లే లేదు’ లాంటి కొన్ని శ్లోకాలు చెప్తూ ఉంటాడు.

మొదట సోలో బ్రతుకే అన్నా కూడా తర్వాత నభ తో ప్రేమ పాటలు పాడుతాడు. ఈ సినిమాలో సాయి ధరమ్ కి జోడీ గా నభ నటేష్ నటిస్తుంది. ఈ సినిమా నుండి ఇప్పటికి విడుదలైన పాటలు ఆకట్టుకున్నాయి. థమన్ అందించిన సంగీతం సినిమాకి ప్రత్యేకంగా నిలవనుంది. ఈ క్రిస్టమస్ సందర్భంగా డిసెంబర్ 25 న ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. సినిమా విడుదలకి ముందు ప్రొమోషన్ కూడా బాగానే చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించాడు. సుబ్బు అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular