fbpx
Wednesday, May 1, 2024
HomeMovie News'విరాట పర్వం' - దేశం ముందు ఒక ప్రశ్నగా నిలబడ్డ జీవితం

‘విరాట పర్వం’ – దేశం ముందు ఒక ప్రశ్నగా నిలబడ్డ జీవితం

DaggubaatiRana ViraataParvam FirstGlimpseRelased

టాలీవుడ్: దగ్గుబాటి రానా హీరోగా ప్రస్తుతం చేస్తున్న సినీమా ‘విరాట పర్వం’. ‘నీది నాది ఒకే కథ‘ లాంటి ఒక అద్భుతమైన కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా తర్వాత వెంటనే రానా తో ఈ సినిమా చేస్తున్నాడు వేణు ఊడుగుల. ఈరోజు రానా పుట్టిన రోజు సందర్భంగా రానా ఫస్ట్ లుక్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ కూడా విడుదల చేసారు. ఈ చిన్న టీజర్ వీడియో ఆద్యంతం ఇంటెన్సిటీ తో ఆకట్టుకుంది. ఈ వీడియో ప్రారంభం 1990 ల్లో జరిగిన యదార్థ కథ ఆధారంగా రూపొందిన సినీమా అంటూ మొదలు పెట్టారు. ఆ సమయంలో జరిగిన నక్సలైట్ కథ ఆధారంగా ఈ సినీమా రూపొందింది.

‘ఈ దేశం ముందు ఒక ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది. సత్యాన్వేషణ లో నెత్తురోడిన హృదయం అతనిది’ అంటూ ‘డా. రవి శంకర్ అలియాస్ కామ్రేడ్ రవన్న’ త్వరలోనే మీ ముందుకు వస్తున్నారని ‘విరాటపర్వం’ ఫస్ట్ గ్లింప్స్ చూపించారు. ఈ సినీమా ద్వారా డా. రవి శంకర్ కామ్రేడ్ రవన్న లాగా ఎలా మారాడు అనేది కథాంశం అన్నట్టు తెలుస్తుంది. డానీ సాంచెజ్ లోపెజ్ – దివాకర్ మణి అందించిన సినిమాటోగ్రఫీ టీజర్ లో చూపించిన ప్రతీ ఫ్రేమ్ ఆకట్టుకుంది. ఈ సినిమాకి ‘సురేష్ బొబ్బిలి’ అందించిన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. ఇంకా టీజర్ చివర్లో వచ్చే ‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం’ అంటూ తన మాటల్తో మళ్ళీ మ్యాజిక్ చేసాడు డైరెక్టర్ వేణు ఊడుగుల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular