fbpx
HomeMovie NewsRRR - రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు

RRR – రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు

RRRMovie Latest Poster

టాలీవుడ్: ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ RRR . బాహుబలి తర్వాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడం తో తెలుగులో మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో ఎంతో మంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ కూడా అదే స్థాయిలో ఉండి సినిమా పైన అంచనాలు పెంచాయి. ఈ రోజు ఈ సినిమా నుండి ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఒక అప్ డేట్ విడుదల చేసారు.

ఈ పోస్టర్ లో బైక్ పై రైడ్ చేస్తున్న భీం పాత్రధారి తారక్, సీతారామరాజు పాత్రధారి చరణ్ ని చూడవచ్చు. ఇప్పటివరకు RRR నుండి విడుదలైన పోస్టర్ లో ఇద్దరినీ విడివిడిగా చూపించారు. చరణ్ గుర్రం పైన, తారక్ బైక్ పైన ఉండే పోస్టర్స్ చూపించారు. మొదటి సారి ఇద్దరు పాత్రధారులు కలిసి ఉన్న పోస్టర్ ఇవాళ విడుదల చేసారు. మరి ఇది ప్రొమోషన్ కోసమా లేదా సినిమాలో నిజంగా ఈ సీన్ ఉందా తెలియదు. ఉంటే మాత్రం ఈ సీన్స్ కి థియేటర్ దద్దరిల్లిపోవడం ఖాయం.

ఈ పోస్టర్ తో పాటు RRR టీం ఒక అప్ డేట్ కూడా విడుదల చేసింది. రెండు పాటలు మినహా RRR షూటింగ్ మొత్తం పూర్తి అయింది అని చెప్పారు. అంతే కాకుండా తారక్ మరియు చరణ్ లు రెండు భాషల్లో డబ్బింగ్ కూడా పూర్తి చేసారని చెప్పారు. బహుశా లాక్ డౌన్ టైం లో వచ్చిన టైం ని డబ్బింగ్ కోసం వాడుకుని ఉంటారు. అంతే కాకుండా ఇవాళ విడుదల చేసిన పోస్టర్ లో కూడా విడుదల తేదీ ని మొదట ప్రకటించిన 13 అక్టోబర్ నే ఉంచారు. బహుశా కరోనా మరో వేవ్ లేకపోతే అనుకున్న తేదీ కే RRR సినిమాని విడుదల చేసేలా ఉన్నాడు రాజమౌళి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular