fbpx
HomeMovie Newsశర్వా 'ఒకే ఒక జీవితం' ఫస్ట్ లుక్

శర్వా ‘ఒకే ఒక జీవితం’ ఫస్ట్ లుక్

Sharwa OkeOkaJeevitham FirstLook

టాలీవుడ్: కెరీర్ ఆరంభం నుండి కథాపరమైన సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న నటుడు శర్వానంద్. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఎందుకో సక్సెస్ సాదించలేకపోతున్నాడు. తాను ఎప్పుడూ ఫాలో అయ్యే కొత్తదనాన్ని ట్రై చేస్తున్నా కూడా విజయాలు వరించట్లేదు. రీసెంట్ గా విడుదలైన ‘శ్రీకారం’ సినిమాకి మంచి టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం అనుకున్నంత సాదించలేకపోయింది. ప్రస్తుతం శర్వా RX100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం‘ అనే ఇంటెన్స్ లవ్ మరియు యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. దీనితో పాటు తన 30 వ సినిమాని ఒక కొత్త దర్శకుడి దర్శకత్వంలో చేస్తున్నాడు.

ఈ రోజు ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ప్రకటించారు. ‘ఒకే ఒక జీవితం’ అనే టైటిల్ తో విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఒక గిటార్ వేసుకుని సక్సెస్ కోసం ఎదురుచూసే శర్వా లుక్ నుండి వెనక నుండి చూపించారు. బ్యాక్ డ్రాప్ లో పల్లె వాతావరణం, పాత కాసెట్స్, ప్రస్తుత సిటీ వాతావరణం చూపించారు. చూస్తుంటే చిన్నప్పటినుండి మ్యూజిక్ అంటే పిచ్చి ఉండి పెద్దయ్యాక మ్యూజీషియన్ అయ్యే పాత్రలో శర్వా నటించనున్నట్టు అర్ధం అవుతుంది. కానీ సినిమా స్పెషల్ ఏంటి అనేది సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

తమిళ్ లో సినిమాలు రూపొందించే డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శ్రీ కార్తీక్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో శర్వా తల్లి పాత్రలో అక్కినేని అమల నటించడం ప్రత్యేకం. ఈ సినిమాలో శర్వా కి జోడీ గా రీతూ వర్మ నటిస్తుంది. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తుండగా జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. దాదాపు షూటింగ్ చివరి దశలో ఈ సినిమా ఉన్నట్టు అర్ధం అవుతుంది. త్వరగా షూటింగ్ ముగించి థియేటర్లు తెరచుకున్నాక సినిమా విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాని తెలుగు మరియు తమిళ్ రెండు భాషల్లో విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular