fbpx
Sunday, April 28, 2024
HomeMovie Newsఉగాది కి నాని 'టక్ జగదీష్'

ఉగాది కి నాని ‘టక్ జగదీష్’

ReleaseDateAnnouncementFor Nani TuckJagadeeshMovie

టాలీవుడ్: కరోనా తర్వాత థియేటర్లు తెరచి ఇపుడిపుడే సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. రెస్పాన్స్ కూడా బాగానే ఉండడం తో ఇప్పుడు మెల్ల మెల్లగా ఒక్కో సినిమా విడుదల తేదీలు ప్రకటించి డేట్స్ లాక్ చేస్తున్నాయి. ఈ సంక్రాంతి కి ఇప్పటికి మూడు సినిమాలు విడుదల అవుతున్నాయి. కొన్ని సినిమాలు ఇప్పటికే మార్చ్ లో విడుదల తేదీల్ని లాక్ చేసాయి. ఇపుడు మరొక సినిమా కూడా ఉగాది కి తమ సినిమా విడుదల చేయబోతున్నట్టు డేట్ విడుదల చేసారు.నాని ప్రస్తుతం తన 26 వ సినిమా ‘టక్ జగదీష్’ అనే పేరుతో రూపొందిస్తున్నారు. షైన్ క్రియేషన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

‘నిన్ను కోరి’, ‘మజిలీ’ లాంటి సెన్సిబుల్ సినిమాలు తీసి సూపర్ హిట్ డైరెక్టర్ గా పేరుపొందిన శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో నాని రెండు పాత్రలు చేయబోతున్నట్టు టాక్ కూడా వినిపిస్తుంది. ఇప్పటికి విడుదలైన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సంక్రాతి సందర్భంగా ఒక పోస్టర్ విడుదల చేసి అందులోనే ఉగాది సందర్భంగా ఏప్రిల్ 16 న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. పోస్టర్ లో ఫామిలీ మెయిన్ కారెక్టర్ లు అందరిని చూపించారు. నాని ని పెళ్లి కొడుకు చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా తెలుస్తుంది. ఈ సినిమాలో నాని తో పాటు రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. జగపతి బాబు, రావు రమేష్ , నాజర్, నరేష్ ఇలా చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్స్ తో మరో ఫామిలీ ఎంటర్టైనర్ రూపొందుతుందని పోస్టర్ ద్వారా అర్ధం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular