fbpx
Friday, April 26, 2024
HomeMovie Newsఆచార్య షూట్ లో అల్లూరి

ఆచార్య షూట్ లో అల్లూరి

RamCharanTej Joins AacharyaShooting

టాలీవుడ్: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘RRR ‘ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం లో మెగా స్టార్ చిరంజీవి ‘ఆచార్య’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఈరోజునుండి రామ్ చరణ్ ఆచార్య షూట్ లో పాల్గొననున్నాడు. ఒక రెండు వారల క్రితమే రామ్ చరణ్ ఆచార్య సెట్స్ ని సందర్శించాడు. ఆ తర్వాతి రోజునే కరోనా పాజిటివ్ రావడం తో ఇన్నిరోజులు షూటింగ్ కి దూరం గా ఉన్నాడు. ఇప్పుడు కరోనా నుండి కోలుకున్నాక ఆచార్య షూటింగ్ లో పాల్గొన్నాడు.

ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ ‘సిద్దా’ అనే కారెక్టర్ వేయబోతున్నట్టు, ఈ సినిమాలో రామ్ చరణ్ కి సంబంధించిన ప్రీ లుక్ ఒకటి విడుదల చేసింది సినిమా టీం. దేవస్థానాల్లో జరిగే అవినీతి కుంభకోణానికి సంబందించిన కథతో ఈ సినిమా సిద్ధం అవుతుందని ఇదివరకే ఒక వార్త ఉంది. సినిమా మొత్తం ఒక పెద్ద దేవాలయం సెట్ లోనే జరుగుతుంది అని చిరంజీవి విడుదల చేసిన వీడియో ద్వారా అర్ధం అవుతుంది. ఇందులో రామ్ చరణ్ పాత్ర ఒక స్పెషల్ ట్రీట్ లాగా ఉంటుందని, సినిమాలో ఒక ముఖ్యమైన చోట రామ్ చరణ్ 20 నిమిషాల పాత్ర సినిమాని మలుపు తిప్పుతుందని డైరెక్టర్ తెలిపారు. ఈ సినిమాకి మణి శర్మ అందించనున్న సంగీతం స్పెషల్ గా నిలవనుంది. షూటింగ్ త్వరగా పూర్తి చేసి వేసవి వరకు సినిమాని విడుదల చేసే ఏర్పాట్లు చేస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular