fbpx
HomeMovie Newsవిజయ్ సేతుపతి 'ఉప్పెన' లుక్

విజయ్ సేతుపతి ‘ఉప్పెన’ లుక్

VijaySethupathi LookFrom UppenaMovie

టాలీవుడ్: విజయ్ సేతుపతి తెలుగు లో చిరంజీవి నటించిన ‘సైరా నరసింహ రెడ్డి’ సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర ద్వారా పరిచయం అయ్యాడు. ఇప్పుడు మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ నటిస్తున్న ‘ఉప్పెన’ సినిమా ద్వారా ఫుల్ లెంగ్త్ పాత్రతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈరోజు విజయ్ సేతుపతి పుట్టిన రోజు సందర్భంగా విజయ్ సేతుపతి లుక్ ని విడుదల చేసారు సినిమా టీం. సంక్రాంతి కి విడుదలైన ‘మాస్టర్’ సినిమా లో విలన్ గా ఆకట్టుకున్నాడు విజయ్ సేతుపతి. అతి క్రూరమైన విలన్ పాత్రలో విజయ్ సేతుపతి నటన అందరిని మెప్పించింది. ఉప్పెన సినిమాలో మరో సారి విలన్ గా నటిస్తున్నాడు.

ఉప్పెన సినిమా అప్ డేట్స్ లో ఇప్పటి వరకు విజయ్ సేతుపతి లుక్ ని రెవీల్ చెయ్యలేదు. మొన్న విడుదలైన టీజర్ లో కూడా సేతుపతిని ఎక్కడా చూపియ్యలేదు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి అందించిన సంగీతం ఇప్పటికే సూపర్ హిట్ గా నిలిచింది. సుకుమార్ రైటింగ్స్ పేరుతో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఏ సినిమాకి కథ మరియు స్క్రీన్ ప్లే అందించగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి లో విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular