fbpx
HomeMovie Newsవర్మ 'D కంపెనీ' ఫస్ట్ లుక్

వర్మ ‘D కంపెనీ’ ఫస్ట్ లుక్

RamGopalVarma DCompanyMovie FirstLook

టాలీవుడ్: వరుసగా బయోపిక్ సినిమాలు, రియల్ సంఘటనలు, వివాదాస్పద నాయకులు, వివాదాస్పద కథలని ఎంచుకుంటూ సినిమాలు తీస్తున్న వర్మ మరోసారి ఇంకో గ్యాంగ్ స్టర్ సినిమాతో రాబోతున్నాడు. వర్మ కి పట్టు ఉన్న మాఫియా బ్యాక్ డ్రాప్ తోనే ఈ సినిమా రూపొందిస్తున్నాడు. చాలా సంవత్సరాలుగా ఇండియా కి అండర్ వరల్డ్ డాన్ గా పేరు గాంచిన ‘దావూద్ ఇబ్రహీం’ కథని ఎంచుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ఈరోజు విడుదల చేసారు. చేతిలో ఒక గన్ పట్టుకొని గాల్లోకి చూపే పోస్టర్ ఒకటి విడుదల చేసారు. బ్యాక్ గ్రౌండ్ లో ముంబై సిటీ ని చూపించారు.

ఈ సినిమాకి మహాభారత్ అఫ్ అండర్ వరల్డ్ అని టాగ్ లైన్ పెట్టారు. అంతే కాకుండా స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్ కి ఉన్నంత ఇన్నోవేషన్ దావూద్ ఇబ్రహీం కి అండర్ వరల్డ్ లో ఉందని పోస్టర్ లో తెలిపారు. ఎందుకంటే నిజానికి ఒక వీధి గ్యాంగ్ కి ఇంటర్నేషనల్ కంపెనీ గా తయారు చేసారు అన్నట్టు వర్మ పేర్కొన్నారు.

స్పార్క్ కంపెనీ ప్రొడక్షన్ బ్యానర్ పై స్పార్క్ సాగర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ని జనవరి 23 న విడుదల చేయనున్నట్టు కూడా వర్మ ట్వీట్ చేసారు. ఈ సినిమా గురించి మరో ట్వీట్ చేస్తూ ‘ఇది కేవలం దావూద్ ఇబ్రహీం బయోపిక్ మాత్రమే కాకుండా దావూద్ నీడలో బతికిన మరియు దావూద్ వాళ్ళ చాచిన చాలా మంది గ్యాంగ్ స్టర్స్ గురించి’ అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular