fbpx
Sunday, April 28, 2024
HomeMovie Newsరాజ్ తరుణ్ క్రైమ్ థ్రిల్లర్ 'పవర్ ప్లే'

రాజ్ తరుణ్ క్రైమ్ థ్రిల్లర్ ‘పవర్ ప్లే’

RajTharun PowerPlayMovie TeaserLaunch

టాలీవుడ్: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గత కొన్ని సంవత్సరాలుగా వరుసగా ప్లాప్ లు చవి చూసి మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ మధ్య విడుదలైన ‘ఒరేయ్ బుజ్జిగా’ కొంచెం మంచి టాక్ తెచ్చుకుంది. కెరీర్ మొదలైనప్పటినుండి ఇప్పటి వరకు వరుసగా లవ్ స్టోరీస్, కామెడీ స్టోరీ సినిమాల్లోనే నటించిన రాజ్ తరుణ్ మొదటి సారి క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమా చేస్తున్నాడు. సంక్రాతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ , టైటిల్ పోస్టర్ విడుదల చేసి చిన్న టీజర్ కూడా విడుదల చేసారు. ఈ సినిమాని ‘పవర్ ప్లే’ అనే పేరు తో రూపొందించారు. రాజ్ తరుణ్ కి ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాని అందించిన విజయ్ కుమార్ కొండా ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించారు.

సినిమా టీజర్ లో మనీ, డ్రగ్స్, బ్లడ్, గన్స్ చూపించి వివిధ కారెక్టర్లని కూడా చూపించారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ తో పాటు హేమల్, పూర్ణ, కోట శ్రీనివాస రావు, అజయ్, పూజ రామ చంద్రన్, సత్యం రాజేష్, ధన్ రాజ్ మరికొన్ని పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు విజయ్ కుమార్ కొండా కి కూడా ఈ జానర్ లో తియ్యడం ఇదే మొదటిది. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. వనమాలీ క్రియేషన్స్ బ్యానర్ పై దేవాన్ష్ మరియు మహిధర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular