fbpx
Sunday, April 28, 2024
HomeMovie Newsమూవీ టాక్: మాస్టర్

మూవీ టాక్: మాస్టర్

ThalapathyVijay Master MovieTalk

హైదరాబాద్: తమిళ్ లో విజయ్ చాలా పెద్ద హీరో. కానీ తెలుగులో అంత పెద్ద మార్కెట్ లేదు. ఈ మధ్యనే ‘స్నేహితుడు’, ‘అదిరింది’, ‘తుపాకి’ లాంటి సినిమాల ద్వారా కొంత మార్కెట్ పెంచుకుంటున్నాడు. సంక్రాంతి సందర్భంగా విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమా విడుదలైంది. ఈ సినిమా టాక్ ఎలా ఉందో చూద్దాం.

కాలేజ్ లో ప్రొఫెసర్ గా పని చేసే విజయ్ అక్కడి స్టూడెంట్స్ అందరికి ఫెవరెట్. ఈ పాత్రలో విజయ్ కొన్ని కారణాల వలన ఎప్పుడూ మందు మత్తులోనే ఉంటాడు. అలాంటి విజయ్ కొన్ని కారణాల వలన కాలేజ్ వదిలి ఒక పిల్లల జైలు లో ఖైదీ లకి మాస్టర్ లాగా వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళాక అక్కడి పరిస్థితులు ఏంటి వాటిని హీరో ఎలా చక్కదిద్దారు అనేది మిగతా కథ.


కథ విషయానికి వస్తే ఒక పెద్ద కమెర్షియల్ హీరో ని పెట్టినపుడు దర్శకుడికి ప్రయోగాలు చేసేంత ఫ్రీడమ్ ఉండదని మరోసారి ఈ సినిమాతో రుజువైంది. ఒక తెల్సిన కథనే తనదైన స్టైల్ లో చెప్పే ప్రయత్నం చేసాడు డైరెక్టర్ లోకేష్ కానగరాజ్. ఒక స్టేజ్ లో కార్తీ తో ‘ఖైదీ’ సినిమా తీసిన డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ ఈ కథతో సినిమా తీసాడా అని అనిపిస్తుంది. అదొక్కటి మినహాయిస్తే కథ, కథనంలో లోకేష్ కనకరాజ్ ప్రతిభ కనిపిస్తుంది. కారెక్టర్ ల ఇంట్రొడక్షన్ నుంచి చివరి వరకు తన కథనం తో ఆకట్టుకున్నాడు.

నటీనటుల విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది విజయ్ సేతుపతి. కొన్ని కొన్ని ఏరియాస్ లో ఫాన్స్ ని మినహాయిస్తే విజయ్ కన్నా విజయ్ సేతుపతి చాలా మందికి నచ్చుతాడు. ఇందులో భవాని పాత్రల్లో విజయ్ సేతుపతి అద్భుతంగా చేసాడు అని చెప్పుకోవచ్చు. విజయ్ రెగ్యులర్ గానే తన మ్యానరిజమ్స్ తో తన ఫాన్స్ ని సంతృప్తి పరచాడు. హీరోయిన్ మాళవిక తన పాత్ర వరకు బాగానే ఆకట్టుకుంది. మరో పాత్రల్లో నటించిన ‘అర్జున్ దాస్‘ మెప్పించాడు. మిగతావాళ్లందరూ తమ తమ పాత్రల వరకు బాగానే చేసారు.

టెక్నిషియన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది అనిరుద్ రవిచందర్. అనిరుద్ మ్యూజిక్, బాగ్ గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే ఈ సినిమా ఒక అవేరేజ్ సినిమాగా మిగిలిపోయేది. అవకాశం ఉన్న ప్రతీ చోట తమ మ్యూజిక్ తో మ్యాజిక్ చేసాడు అనిరుద్. మరో టెక్నిషియన్ సినిమాటోగ్రాఫర్ ‘సత్యన్ సూర్యన్’. స్క్రీన్ పైన ఈయన విజువల్స్ నెక్స్ట్ లెవెల్ అనిపించుకోవచ్చు. టెక్నికల్ గా చూస్తే ఈ సినిమా ఎక్కడా పేరు పెట్టడానికి లేదు. ఈ సినిమాలో మరో చెప్పుకోదగిన డిపార్ట్మెంట్ ఫైట్ మాస్టర్స్. సినిమాలో ఫైట్స్ కొంచెం లెన్తీ అనిపించినా కూడా ఆకట్టుకుంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గకుండా చూసుకున్నారు నిర్మాతలు. డైరెక్టర్ కానగరాజ్ గురించి చెప్పుకోవాల్సింది ఏమి లేదు. ఒక్క కథ విషయం లో తప్ప మిగతా అన్ని చోట్ల తన ప్రత్యేకత చాటుకున్నాడు.

ఓవరాల్ గా అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే సినిమాని ఫుల్ ఎంజాయ్ చెయ్యొచ్చు. బెస్ట్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం ఈ సినిమాని థియేటర్ లోనే చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular