fbpx
HomeMovie Newsసంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్న 'నారప్ప' ఫ్యామిలీ

సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్న ‘నారప్ప’ ఫ్యామిలీ

DaggubatiVenkatesh Narappa LatestPosterReleased

టాలీవుడ్: తమిళ్ లో ధనూష్ హీరో గా నటించి సూపర్ హిట్ అయిన సినిమా ‘అసురన్’. ఈ సినిమాని తెలుగు లో ‘నారప్ప’ అనే పేరుతో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నారప్ప పాత్రలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, వీ క్రియేషన్స్ బ్యానర్ పై సురేష్ బాబు మరియు కలైపులి ఎస్ థాను ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు.

అసురన్ సినిమా ఒక రివేంజ్ బేస్డ్ సినిమా అయినప్పటికీ యాక్షన్ స్తంట్స్ రియలిస్టిక్ గా ఉంటాయి.సంక్రాంతి సందర్భంగా నారప్ప ఫ్యామిలీ మొత్తం ఒక పోస్టర్ ద్వారా విడుదల చేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసారు సినిమా టీం. ఈ సినిమాలో వెంకటేష్ కి జోడీ గా ప్రియమణి నటిస్తుంది. C/o కంచరపాలెం ఫేమ్ కార్తీక్ రత్నం వెంకటేష్ పెద్ద కొడుకు పాత్రలో నటిస్తున్నాడు. మిగతా పిల్లల్ని కొత్త వాళ్ళని ఎంచుకున్నారు. సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ వేసవికి సినిమాని విడుదల చేయనున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular