fbpx
Thursday, December 12, 2024
HomeMovie Newsసంక్రాంతి శుభాకాంక్షలతో విరాటపర్వం లవ్లీ పోస్టర్

సంక్రాంతి శుభాకాంక్షలతో విరాటపర్వం లవ్లీ పోస్టర్

ViraataParvam NewPoster OnSankranthi

టాలీవుడ్: ‘నీది నాది ఒకే కథ‘ డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వం లో దగ్గుబాటి రానా ‘విరాట పర్వం’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో హీరో కి సమానమైన పాత్రలో సాయి పల్లవి నటిస్తుంది, మరో ముఖ్యమైన పాత్రలో ప్రియమణి నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన చాలా పోస్టర్స్ , టీజర్స్ విడుదల అయ్యాయి. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్ అన్ని సీరియస్ లుక్స్ తో , టీజర్ కూడా విప్లవాత్మకమైన శబ్దాలతో ఉంది. ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియ చేస్తూ సినిమా టీం ఒక పోస్టర్ విడుదల చేసింది.సాయి పల్లవి, రానా చేతిలో చేయి పట్టుకొని నవ్వుతూ నడుస్తూ ఉంటారు. ఈ పోస్టర్ ద్వారా ఈ సినిమాలో లవ్ ఎపిసోడ్ కూడా ఉన్నట్టు తెలియచేసారు.

రెగ్యులర్ ఫార్మాట్ కథలు కాకుండా, నిజ జీవిత సంఘటనలని బేస్ చేసుకుని తన కథల ద్వారా , నిజ జీవిత సంఘటనల ఆధారంగా సీన్స్ రాసుకుని ప్రెసెంట్ చేస్తాడని వేణు ఉడుగులకి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చింది. తన రెండవ సినిమాకి కూడా 90 ల్లో జరిగిన నక్సలైట్ కథని రాసుకున్నాడు. ఈ కథ కూడా ఒక నిజ జీవిత నక్సలైట్ జీవితం లోని కొన్ని సంఘటలను ఆధారంగా రాసుకున్నట్టు ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు. రెగులర్ కమర్షియల్ సినిమా కాకపోయినా కంటెంట్ ఉన్న సినిమాలకోసం ఎదురుచూసే కొందరు ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా కోసం చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు. ఈ రోజు విడుదల చేసిన పోస్టర్ ద్వారా 2021 సమ్మర్ లో ఈ సినిమా విడుదల అవనున్నట్టు తెలియ చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular