fbpx
HomeMovie Newsఆసక్తికరంగా 'WWW ' టీజర్

ఆసక్తికరంగా ‘WWW ‘ టీజర్

WWW WhoWhereWhyMovie TeaserReleased

టాలీవుడ్: కొన్ని కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా మన దేశం లో తమిళ్ లో చూస్తుంటాం. కానీ గత కొన్ని సంవత్సరాలుగా తెలుగులో కూడా అపుడపుడు కొన్ని కొత్త రకమైన సినిమాలు వస్తున్నాయి. పిఎస్వి గరుడవేగా సినిమా ఆకోవకే చెందుతుంది. ఇపుడు అలాంటి మరోక సినిమా తెలుగులో రాబోతుంది. WWW (Who, Where , Why ) అనే టైటిల్ తో సైబర్ అట్టాక్స్, ఆన్ లైన్ అటాక్స్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతుంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రానా విడుదల చేయగా టీజర్ ని మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేయించారు.

అదిత్ అరుణ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. రాజశేఖర్ కూతురు శివాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. మరో ముఖ్య పాత్రలో వైవా హర్ష నటిస్తున్నాడు. కొరియోగ్రాఫర్ గా చాలా సినిమాలు చేసిన కే వీ గుహన్, కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 118 సినిమాతో డైరెక్టర్ గా మారాడు. WWW సినిమా ద్వారా కే వీ గుహన్ తన దర్శకత్వంలో రెండవ సినిమాని సిద్ధం చేసాడు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఒక ఆన్లైన్ అటాక్ కి సంబందించినట్టుగా టీజర్ ద్వారా తెలుస్తుంది. రామంత్ర క్రియేషన్స్ బ్యానర్ పై రవి పి.రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా విడుదల వివరాలు మరి కొద్దీ రోజుల్లో తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular