fbpx
HomeMovie Newsకాల్షీట్లు ఖాళీ లేకుండా సినిమాలు చేస్తున్న రకుల్

కాల్షీట్లు ఖాళీ లేకుండా సినిమాలు చేస్తున్న రకుల్

RakulPreetSingh BusyWith MultipleProjects

టాలీవుడ్: ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ రేంజ్ లో ఉన్న హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. తెలుగులో ఇప్పుడు టాప్ లో ఉన్న హీరోల్లో దాదాపు అందరితో నటించిన ఈ హీరోయిన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల లిస్ట్ షేర్ చేసారు. ఈ మధ్య తాను ఆ సినిమాలో నటిస్తుంది ఈ సినిమాలో నటిస్తుంది అన్ని రక రకాల రూమర్స్ వస్తున్న నేపథ్యం లో వాటిని క్లియర్ చేసేందుకు ఈ ప్రకటన విడుదల చేసారు. రకుల్ ప్రస్తుతం చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న ‘చెక్’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో ఒక అడ్వొకేట్ పాత్రలో నటిస్తుంది. అంతే కాకుండా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఒక సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయిపోయింది అని కన్ఫర్మ్ చేసారు.

ఇవే కాకుండా బాలీవుడ్ లో రకుల్ చేయబోయే ఫ్యూచర్ ప్రాజెక్టులు చూస్తే మంచి లైన్ అప్ ఉందని అర్ధం అవుతుంది. బోణీ కపూర్ తనయుడు అర్జున్ కపూర్ తో ఒక సినిమాలో నటిస్తుంది. జాన్ అబ్రహం తో కలిసి ‘ఎటాక్’ అనే సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మే డే’ అనే సినిమాలో కూడా రకుల్ హీరోయిన్ గా నటించబోతుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో తన చేతిలో మూడు క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఇవే కాకుండా తమిళ్ లో కూడా తన చేతిలో ఒక మూవీ ఉంది. కోలీవుడ్ అప్ కమింగ్ హీరో శివ కార్తికేయన్ తో ‘అయలాన్’ అనే చిత్రంలో రకుల్ హీరోయిన్ గా నటించబోతుంది. ఇలా భాషతో సంబంధం లేడకుండా అన్ని రకాల సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో రకుల్ దూసుకెళ్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular