fbpx
HomeMovie Newsఆస్కార్ బరిలో 'జల్లి కట్టు'

ఆస్కార్ బరిలో ‘జల్లి కట్టు’

Jallikattu MovieIn OscarNominations

మాలీవుడ్: ప్రతి సంవత్సరం మన దగ్గరి నుండి కొన్ని సినిమాలు ఆస్కార్ బరి లోకి వెళ్లడం ఎలాంటి అవార్డు లేకుండా తిరిగి వెనక్కి రావడం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. ఎప్పటిలాగానే ఈ సారి కూడా కొన్ని సెలెక్టెడ్ సినిమాలు ఆస్కార్ సెలెక్షన్స్ కి వెళ్లాయి. ఇందులో మలయాళం సినిమాలు హిందీ సినిమాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సారి కూడా ఒక మళయాళం సినిమా ఆస్కార్ బరిలోకి సెలెక్ట్ అయింది. 2021 ఆస్కార్ నామినేషన్ లో జల్లి కట్టు అనే మలయాళం సినిమాకి అవకాశం ఇవ్వనున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. దాదాపు 27 సినిమాలలో ఈ సినిమాని ఎంపిక చేసారు.

మాంసం కోసం ఒక దున్న పోతును చంపడానికి ప్రయత్నిస్తే అది తప్పించుకుని పారిపోయి ఊరిని మొత్తం నాశనం చేస్తుంది. ఆ దున్నపోతుని వెంటాడే క్రమమే ఈ సినిమా కథ. చాలా సన్నీ వేషాలు చాలా నాచురల్ గా తీశారు. చాలా మంది ప్రాణాలని తీసిన ఆ దున్నపోతుని పట్టుకునే క్రమంలో వచ్చే సీన్స్ నిజంగానే జరిగినట్టు ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా తీశారు. ఈ మధ్యనే ఈ సినిమాని తెలుగు వాళ్ళకి ఆహా ఓటీటీ లో అందుబాటులో ఉంచారు. లిజో జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆస్కార్ బరిలో ఉండడం ఆనందాన్నిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular