fbpx
HomeMovie News'ఎనిమీ ' గా రాబోతున్న విశాల్ మరియు ఆర్య

‘ఎనిమీ ‘ గా రాబోతున్న విశాల్ మరియు ఆర్య

VishalandArya Multistarrer TitleReleased

కోలీవుడ్: తమిళ్ యాక్టర్స్ విశాల్ మరియు ఆర్య ప్రధాన పాత్రలుగా ఒక మల్టీ స్టారర్ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. వీళ్లిద్దరు ఇదివరకే నాచురల్ డైరెక్టర్ బాల డైరెక్క్షన్ లో ‘వాడు వీడు’ అనే సినిమా చేసి యాక్టర్స్ గా మంచి గుర్తింపు పొందారు. ఇపుడు వీళ్లిద్దరు కలిసి మరొక సినిమాలో నటించనున్నారు. ఆ సినిమాకి సంబందించిన టైటిల్ ఇవాళ విడుదల చేసారు. ‘ఎనిమీ’ అనే టైటిల్ విడుదల చేస్తూ టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేసారు సినిమా టీం. వరుస విజయాలతో ఊపు మీదున్న విశాల్ ఈ సినిమాతో మరొక యాక్షన్ మూవీ ని తన ఖాతా లో వేసుకున్నాడు. ఈ మధ్య కొంచెం వెనుక పడిన ఆర్య ఈ సినిమా ద్వారా మళ్ళీ పూర్వ ఫామ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.

ఈ సినిమాకి విజయ్ దేవరకొండ నటించిన ‘నోటా’ అలాగే విక్రమ్ నటించిన ‘ఇంకొక్కడు’ సినిమాలకి దర్శకత్వం వహించిన ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న థమన్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నాడు. అంతే కాకుండా ఈ సినిమాలో మరొక ముఖ్యమైన పాత్రలో మృణాళిని రవి నటిస్తుంది. ఈ అమ్మాయి గడ్డలకొండ గణేష్ ద్వారా తెలుగు సినిమాకి పరిచయం అయింది. తమిళ్ లో కూడా సూపర్ డీలక్స్ లాంటి సినిమాలు చేసి ఇపుడిపుడే ఎదుగుతుంది. “నాకు మంచి స్నేహితుడైన ఆర్య ఇపుడు నా ‘ఎనిమీ ‘. మాకు కొట్టుకోవడం తప్ప ఇంకో ఒప్షన్ లేదు” అంటూ ట్వీట్ చేస్తూ సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేసాడు విశాల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular