fbpx
HomeMovie Newsనాని విడుదల చేసిన '777 చార్లీ' టీజర్

నాని విడుదల చేసిన ‘777 చార్లీ’ టీజర్

RakshithShetty 777Charlie TeaserRelease

శాండల్ వుడ్ : కన్నడ లో రక్షిత్ శెట్టి సినిమాలకి ఒక సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన నుండి సినిమా వస్తుంది అంటే ఎంతో కొంత కొత్తదనం ఉంటుంది అనే అంచనాలు సెట్ చేసారు ఈ కన్నడ హీరో. తెలుగు లో పోయిన సంవత్సరం విడుదలైన ‘అతడే శ్రీమన్నారాయణ’ తో ఇక్క్డడ కూడా మొదటి సినిమా విడుదల చేసాడు. పబ్లిసిటీ సరిగ్గా లేక ఈ సినిమా చాలా మందికి రీచ్ అవలేదు కానీ చూసిన వాళ్ళు మాత్రం ఈ సినిమాని మెచ్చుకున్నారు. తెలుగులో నిఖిల్ నటించిన ‘కిరాక్ పార్టీ’ ఒరిజినల్ వెర్షన్ ‘కిరిక్ పార్టీ’ కూడా ఈ హీరో నటించిన సినిమానే.

ప్రస్తుతం రక్షిత్ శెట్టి మరొక కొత్త ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు. ఆ సినిమానే ‘చార్లీ 777 ‘. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన టీజర్ ని విడుదల చేసారు. ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా తెలుగు టీజర్ ని నాచురల్ స్టార్ నాని విడుదల చేసారు. సినిమా టైటిల్ లో మరియు టీజర్ లో ఒక కుక్కని చూపించారు. టీజర్ మొత్తం చార్లీ అనే కుక్క దిన చర్య చూపించి చివరకి ఆ కుక్క హీరో రక్షిత్ శెట్టి దగ్గరికి రావడం చూపిస్తారు. మొత్తంగా చూసుకుంటే రెగ్యులర్ సినిమా లాగ కాకుండా ఎదో కొంత కొత్తగా ప్రయత్నించారు అని అనిపిస్తుంది. ఈ సినిమా నిర్మాణంలో కూడా రక్షిత్ శెట్టి భాగస్వామి. కే.కిరణ్ రాజ్ దర్శకత్వం లో ఈ సినిమా రూపొందింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular