fbpx
HomeMovie Newsమొదటి వెబ్ కంటెంట్ లో మెప్పించిన సమంత

మొదటి వెబ్ కంటెంట్ లో మెప్పించిన సమంత

Samantha ReceivingAppreciationFor RajiRole

బాలీవుడ్: ఇపుడు ట్రెండ్ కి తగ్గట్టు పెద్ద నటులు అందరూ ఓటీటీ మరియు వెబ్ కంటెంట్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇంకా తెలుగులో హీరోలు ఆ దిశగా ప్రయత్నాలు చేయనప్పటికీ హీరోయిన్లు మాత్రం మొదలు పెట్టారు. ఇప్పటికే కాజల్, తమన్నా వెబ్ సిరీస్ లలో నటించారు. ప్రస్తుతం సమంత కూడా నిన్న విడుదలైన ఫామిలీ మాన్ సీజన్ 2 తో వెబ్ కంటెంట్ లో అడుగుపెట్టారు.

ఈ సిరీస్ మొత్తం లో సమంత పాత్ర స్పెషల్ అని చెప్పవచ్చు. ఒక స్తబర్న్ పాత్రలో సమంత నటన ఆకట్టుకుందని చెప్పవచ్చు. అంతే కాకుండా ఈ సిరీస్ కోసం ఏది చేయాలో అన్నీ సమంత చేసింది అని చెప్పవచ్చు. బోల్డ్ సీన్స్ మాత్రమే కాకుండా ఎంతో ఫీజికల్ ఎఫర్ట్ ఉండే పాత్ర సమంత ఎంపిక చేసుకుని దాని కోసం తన పూర్తి ప్రయత్నం చేసి సఫలం అయిందని చెప్పవచ్చు. సమంత కెరీర్ లో ఈ పాత్ర స్పెషల్ అని కూడా చెప్పవచ్చు. ఈ పాత్ర సమంత పోషించిన విధానానికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు కూడా పొందుతుంది సమంత.

కానీ కాజల్, తమన్నా కన్నా ఓటీటీ రంగం లో సమంత కి ఎక్కువ మార్కులు పడ్డాయి అని చెప్పవచ్చు. సినిమాల్లో చేయలేని పాత్రలకి, ప్రయోగాలకి ఓటీటీ లో చేయగలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సమంత ఆ స్టెప్ తీసుకుని తాను ఎందుకు స్పెషల్ ఓ అని చెప్పే ప్రయత్నం చెప్పింది. ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైనప్పటి నుండి తమిళుల దగ్గరి నుండి సమంత కి ట్రోల్ల్స్ ఎదురయ్యాయి. సమంత ఒక్క దానికి కూడా రెస్పాండ్ అవలేదు కానీ విడుదలయ్యాక అదే తమిళుల నుండి ప్రశంసలు అందుకుంది సమంత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular