fbpx
HomeMovie Newsస్టాండప్ కమెడియన్ పాత్రలో రాజ్ తరుణ్

స్టాండప్ కమెడియన్ పాత్రలో రాజ్ తరుణ్

RajTharun StandupRahul BirthdayPoster

టాలీవుడ్: ఇప్పుడు వచ్చే సినిమాల్లో హీరోలు కొత్త కొత్త పాత్రల్లో కొత్త అవతారాల్లో మాత్రమే కాకుండా వాళ్ళు చేసే పాత్రల ప్రొఫెషన్స్ కూడా జెనెరేషన్ కి తగ్గట్టే ఉంటున్నాయి. ఇపుడు మార్కెట్ లో స్టాండప్ కమెడియన్స్ కొద్దీ కొద్దిగా అవతరిస్తున్నారు. కొందరు దీన్ని కెరీర్ గా కూడా సెలెక్ట్ చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇపుడు ఒక తెలుగు సినిమాలో కూడా ఈ ప్రొఫెషన్ ని కూడా వాడబోతున్నారు. రాజ్ తరుణ్ హీరోగా ఒక కొత్త సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ స్టాండప్ కమెడియన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా పేరు కూడా ‘స్టాండప్ రాహుల్‘ అని హీరో ప్రొఫెషన్ ని బేస్ చేసుకుని ఉంది.

ఈ రోజు రాజ్ తరుణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీం రాజ్ తరుణ్ లేటెస్ట్ పోస్టర్ ఒకటి విడుదల చేసింది. ఒక ఈవెంట్ లో స్టాండప్ కామెడీ చేస్తున్న రాజ్ తరుణ్ ని ఈ పోస్టర్ లో చూడవచ్చు. వరుస ప్లాప్ లలో ఉన్న రాజ్ తరుణ్ ఈ మధ్యన విక్రమ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాతో మీడియం టాక్ తెచ్చుకుని కొంత రిలీఫ్ పొందాడు. రొమాంటిక్ కామెడీ జానర్లో రూపొందుతున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ కి జోడీ గా వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తుంది. సాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ‘కేరాఫ్ కంచరపాలెం‘ సినిమాకి సంగీతం అందించిన స్వీకర్ అగస్తి పని చేయనున్నారు. ఈ సినిమాను నందకుమార్ అబ్బీనేని, భరత్ మాగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular