fbpx
HomeMovie Newsరాజ్ తరుణ్ 'స్టాండప్ రాహుల్' ఫస్ట్ లుక్

రాజ్ తరుణ్ ‘స్టాండప్ రాహుల్’ ఫస్ట్ లుక్

RajTharun StandupRahul FirstLook

టాలీవుడ్: యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం మరో సినిమాతో మన ముందుకు రానున్నాడు. వరుస ప్లాపులతో ఉన్న రాజ్ తరుణ్ కి ఓటీటీ లో విడుదలైన ‘ఒరేయ్ బుజ్జిగా’ కొద్దిగా రిలీఫ్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ ‘పవర్ ప్లే’ అంతగా ఆకట్టుకోకపోవడం తో మళ్ళీ ప్లాప్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ‘స్టాండప్ రాహుల్’ అనే మరో రొమాంటిక్ కామెడీ జానర్ సినిమాతో వస్తున్నాడు. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ని సమంత విడుదల చేసారు. ‘కుర్చుంది చాలు’ అనే టాగ్ లైన్ తో ఈ సినిమా రాబోతుంది.

ఎప్పుడూ మొబైల్స్ లేదా లాప్టాప్ పట్టుకుని కూర్చునే యువకుడి క్యారెక్టర్ లో రాజ్ తరుణ్ నటించనున్నట్టు ఫస్ట్ లుక్ లో ఉన్న హెడ్ సెట్స్, వర్చ్యువల్ రియాలిటీ బాక్స్, తన పై ఉన్న కేబుల్స్, లోడింగ్ సింబల్ ఉన్న తన టీ షర్ట్ చూస్తే అర్ధం అవుతుంది. మిడిల్ క్లాస్ మెలోడీస్ హీరోయిన్ వర్ష బోల్లమ్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. మరిన్ని పాత్రల్లో మురళి శర్మ, వెన్నెల కిషోర్ నటిస్తున్నారు. డ్రీం టౌన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నందకుమార్, భరత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సాంటో మోహన్ వీరంకి అనే నూతన దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. స్వీకర్ అగస్తి సంగీతం తో ఈ సినిమా రూపొందనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular