fbpx
HomeSportsతొలి మ్యాచ్ తో రికార్డు నెలకొల్పిన ప్రసిద్ధ్ కృష్ణ

తొలి మ్యాచ్ తో రికార్డు నెలకొల్పిన ప్రసిద్ధ్ కృష్ణ

PRASIDDH-DEBUT-BOWLER-RECORDS-4WICKETS-IN-ENGLAND-MATCH

పూణే: ప్రసిద్ద్‌ కృష్ణ, కర్ణాటక పేసర్ ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో అరంగేట్రం చేసి తన‌ అద్భుత ప్రదర్శనతో (4/54) అందరినీ మెప్పించాడు. మంగళవారం పూణే లోని ఎమ్‌సీఏ మైదానం వేదికగా జరిగిన మొదటి వన్డేలో కృనాల్‌ పాండ్యాతో పాటు అంతర్జాతీయ కెరీర్ ను మొదలు పెట్టాడు ప్రసిద్ధ్..

తన అద్భుత బౌలింగ్ తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. కీలక సమయంలో 4 వికెట్లు జేసన్ రాయ్, బెన్ స్టోక్స్‌, సామ్‌ బిల్లింగ్స్‌, టామ్ కర్రన్ వికెట్లు తీసి ఇంగ్లండ్‌ ఓటమికి బాటలు వేశాడు. 8.1 ఓవర్లు బౌల్‌ చేసిన కృష్ణ 54 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ వన్డే అరంగేట్రంలో ఏ భారత బౌలర్‌కు సాధ్యపడని నాలుగు వికెట్ల ఘనతను సాధించి రికార్డు సృష్టించాడు.

ఇంతకు ముందు వన్డే అరంగేట్రం చేసిన మ్యాచ్ లో భారత బౌలర్లు నోయల్ డేవిడ్ (3/21), వరుణ్ అరోణ్ (3/24), హార్దిక్ పాండ్యా (3/31), పీయూస్ చావ్లా (3/37)లు మూడు వికెట్ల ప్రదర్శన చేయగా తాజాగా ప్రసిద్ద్‌ కృష్ణ ఆ నలుగురు బౌలర్లను వెనక్కునెట్టి నాలుగు వికెట్లు ప్రదర్శనతో వీరందరిలో అగ్రస్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ప్రసిద్ద్‌ కృష్ణ ఆ రికార్డును సవరించి 24 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.

ఇంగ్లండ్ తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 66 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. దీని ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తో ఆధిక్యంలో ఉంది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన కోహ్లీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. భారత బౌలర్ల ధాటికి లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ 42.1 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular