న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశ పెట్టిన యూనియన్ బడ్జెట్ 2024 లో ఈ సారి తెలంగాణకు తీవ్ర నిరాశే మిగిలింది. కేటాయింపుల్లో ఎక్కడా తెలంగాణ ఊసే లేదు.
ఇంత వరకు ఎప్పుడూ లేనట్టుగా తెలంగాణలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 8 సీట్లు గెలుచుకుంది.
అయితే, ఈ నేపథ్యంలో తెలంగాణకు కేంద్రం ప్రాధాన్యతను ఇచ్చి తగినన్ని నిధులు కేటాయిస్తుందని అందరూ ఆశించారు.
కానీ, ఊహించని రీతిలో కేంద్రం భారీ ఆశలు పెట్టుకున్న తెలంగాణ ప్రజలు, నాయకులపై పిడుగు వేసినంత పని చేసింది.
దీని వల్ల, ఇప్పుడు బీజేపీయేతర పార్టీలు తెలంగాణలోని బీజేపీ ఎంపీలను టార్గెట్ చేస్తున్నాయి. కేంద్రంలో బిజేపీ ఉన్నా రాష్ట్రానికి నిధులు రాబట్టలేకపోయారని విమర్శిస్తున్నారు.
మరి దీనిపై రాష్ట్ర ఎంపీలు కేంద్రంతో ఏమి మాట్లాదతారో, కేంద్రం ఏమి సమాధానం ఇస్తుందో అన్నది ఆసక్తికర అంశం.