fbpx
HomeMovie Newsశ్రీదేవి సోడా సెంటర్ ఫస్ట్ గ్లింప్స్

శ్రీదేవి సోడా సెంటర్ ఫస్ట్ గ్లింప్స్

SrideviSodaCenter Movie FirstGlimpse

టాలీవుడ్: సుధీర్ బాబు హీరోగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే టైటిల్ తో సినిమా రూపొందుతుంది. పలాస 1978 సినిమాని రూపొందించిన కరుణ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ రోజు సుధీర్ బాబు పుట్టిన రోజు సందర్భంగా సుధీర్ బాబు కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాకి సంబందించిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో ని విడుదల చేసింది సినిమా టీం. గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ లో నాటుపడవల మధ్య హీరో ని చూపించారు. ఈ సినిమాలో ఒక పల్లెటూర్లో లైటింగ్ పెట్టే పల్లెటూరి వ్యక్తి సూరిబాబు గా సుధీర్ బాబు నటిస్తున్నాడు.

‘గ్లింప్స్ అఫ్ లైటింగ్ సూరిబాబు’ అనే టైటిల్ తో విడుదలైన ఈ చిన్న వీడియో ఆకట్టుకుంది. ఈ వీడియో లో శాందత్ సాయినుద్దీన్ అందించిన విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయాని చెప్పుకోవచ్చు. మణి శర్మ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా ‘జాంబీ రెడ్డి’ తో హిట్ కొట్టిన ఆనంది ఈ సినిమాలో సుదీర్ బాబు సరసన నటించనుంది. ఈ సినిమాలో ప్రయేక ఫిజిక్ కోసం సుధీర్ బాబు కష్టం స్క్రీన్ పైన కనిపిస్తుంది. 70 MM ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శశి దేవి రెడ్డి, విజయ్ చల్లా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పలాస లాగే ఈ సినిమాకి కూడా ప్రత్యేక నేటివిటీ ని ఎంచుకుని మరోసారి సక్సెస్ కొట్టే ప్రయత్నంలో డైరెక్టర్ కరుణ కుమార్ ఉన్నాడు అని తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular