fbpx
HomeMovie Newsపవర్ స్టార్ 'ద్విత్వ' ఫస్ట్ లుక్

పవర్ స్టార్ ‘ద్విత్వ’ ఫస్ట్ లుక్

PuneethRajkumar Dvitva FirstLook

శాండల్ వుడ్: తెలుగులో పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ అని పిలుచుకున్నట్టు కన్నడ ఇండస్ట్రీ లో పునీత్ రాజ్ కుమార్ ని పవర్ స్టార్ అని పిలుస్తారు. రాజ్ కుమార్ వారసుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన పునీత్ డాన్స్ ల పరంగా, ఫైట్స్ పరంగా అక్కడ ఫాన్స్ ని సంపాదించుకున్నాడు. ఒకప్పుడు అంటే కన్నడ సినిమాలు పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు కానీ కే.జి.ఎఫ్ సినిమా తర్వాత అక్కడ నుండి విడుదలయ్యే సినిమాలపై అందరి దృష్టి పడుతుంది. కొంచెం మంచిగా ఉంటే గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుతం కే.జి.ఎఫ్ మేకర్స్ పునీత్ రాజ్ కుమార్ తో ఒక సినిమా రూపొందిస్తున్నారు. ఆ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ఈరోజు విడుదల చేసారు.

హోంబేలె ఫిలిమ్స్ పునీత్ హీరో గా ‘ద్విత్వ’ అనే టైటిల్ తో సినిమా రూపొందిస్తున్నట్టు ఈరోజు తెలిపారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ అన్నట్టు మేకర్స్ ప్రకటించారు. టైటిల్ డిజైన్ తో పాటు ఫస్ట్ లుక్ లో పునీత్ లుక్ కూడా కొత్తదనం తో ఉంది. కే.జి.ఎఫ్ లాగానే ఈ సినిమా పోస్టర్ డిజైన్ కూడా పూర్తిగా బ్లాక్ అండ్ రెడ్ లో డిజైన్ చేయించారు హోంబేలె ఫిలిమ్స్. ద్విత్వ అంటే ద్వంద్వత్వం అని మరి ఇందులో హీరో కారెక్టరైజెశన్ ఎలా ఉండబోతుంది అని అంచనాలు పెంచారు. మరొక విశేషం ఏంటంటే ‘లూసియా’, ‘యూ టర్న్’ లాంటి వైవిధ్య మైన సినిమాలని డైరెక్ట్ చేసిన పవన్ కుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. సెప్టెంబర్ లో ఈ సినిమా మొదలవనున్నట్టు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular