fbpx
HomeMovie Newsతేజ సజ్జా 'అద్భుతం' ఫస్ట్ లుక్

తేజ సజ్జా ‘అద్భుతం’ ఫస్ట్ లుక్

TejaSajja AdbuthamMovie FirstLook

టాలీవుడ్: చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు టాప్ హీరోలు అందరితో నటించిన తేజ సజ్జ పెద్దయ్యాక సమంత నటించిన ‘ఓ బేబీ’ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. ఈ సంవత్సరం ఫిబ్రవరి లో విడుదలైన ‘జాంబీ రెడ్డి’ సినిమాతో హీరో గా పరిచయం అయ్యి మొదటి సక్సెస్ సాధించాడు. అది షూటింగ్ లో ఉండగానే ‘ఇష్క్’ అనే మలయాళం రీమేక్ మూవీ అదే టైటిల్ తో రూపొందించారు. ఈ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ మధ్యనే జాంబీ రెడ్డి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తో ‘హను మాన్’ అనే సినిమా కూడా మొదలు పెట్టాడు. ఇవే కాకుండా ఈ రోజు ఒక సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసి షాక్ ఇచ్చాడు.

ఎపుడు షూటింగ్ చేసారో కానీ ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ‘అద్భుతం’ అనే టైటిల్ తో తేజ సజ్జ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో రాజ శేఖర్ కుమార్తె శివాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ఫస్ట్ లుక్ లో ఒకే బెంచ్ పై కూర్చొని టైం చూస్తున్న హీరో, హీరోయిన్ ని మిర్రర్ ఇమేజ్ లాగ చూపించారు. ఇదొక ఫాంటసీ జానర్ సినిమా అని అర్ధం అవుతుంది. ఈ సినిమాకి కూడా కథని జాంబీ రెడ్డి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అందించారు. లక్ష్మి భూపాల స్క్రీన్ ప్లే మరియు మాటలు అందిస్తున్నారు. రాడాన్ సంగీతం లో ఈ సినిమా రూపొందుతుంది. మహాతేజ క్రియేషన్స్ మరియు ఎస్.ఒరిజినల్స్ బ్యానర్స్ పై చంద్ర శేఖర్ మొగుల్ల , సృజన్ ఎరబోలు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మల్లిక్ రామ్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular