fbpx
HomeMovie Newsఅమల పాల్ 'కుడి ఎడమైతే' ఫస్ట్ లుక్

అమల పాల్ ‘కుడి ఎడమైతే’ ఫస్ట్ లుక్

AmalaPaul KudiYedamaithe FirstLook

టాలీవుడ్: తెలుగు కంటెంట్ తో దూసుకెళ్తున్నారు ఆహ ఓటీటీ. మొదట్లో కొన్ని సినిమాలతో ప్రారంభించి, తర్వాత రీజనల్ కంటెంట్ ని కొంత వరకు రెడీ చేసి , తర్వాత సినిమాలని డబ్ చేసి విడుదల చేసారు, కొన్ని చిన్న సినిమాలని కొని డైరెక్ట్ ఓటీటీ లో విడుదల చేసారు. తర్వాత స్పెషల్ ఓటీటీ కంటెంట్ ని రెడీ చేస్తూ విడుదల చేస్తూ యూజర్స్ ని పెంచుకుంటూ ఆహా అనిపించుకుంటున్నారు. కేవలం చిన్న, కొత్త డైరెక్టర్ లతో మాత్రమే కాకుండా పెద్ద హీరోయిన్ లతో పెద్ద డైరెక్టర్ లతో కూడా సినిమాలు చేస్తున్నారు. ఇదివరకే తమన్నా తో ’11th హావర్’ అనే సినిమాని రూపొందించిన ఆహా ప్రస్తుతం మరో టాప్ హీరోయిన్ తో ఇంకో వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్నారు.

ప్రస్తుతం ‘అమలా పాల్‘ ప్రధాన పాత్రలో ఒక వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ‘కుడి ఎడమైతే’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సిరీస్ ఫస్ట్ లుక్ ఇవాళ విడుదల చేసారు. ఈ సిరీస్ లో అమలా పాల్ తో పాటు ‘సూర్య కాంతం’ సినిమాతో హీరో గా గుర్తింపు పొందిన ఫైట్ మాస్టర్ విజయన్ కుమారుడు రాహుల్ విజయ్ నటిస్తున్నాడు. ‘లూసియా’ తెలుగులో ‘నాలో ఒకడు’ మరియు ‘యూ టర్న్’ సినిమాలని డైరెక్ట్ చేసిన పవన్ కుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నారు. లిమిటెడ్ బడ్జెట్ లో తక్కువ టైం లో సినిమాలని రూపొందిస్తూ ఓటీటీ లో విడుదల చేస్తూ ఆహా వారు ఈ లాక్ డౌన్ టైం లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మరి కొద్దీ రోజుల్లో ఈ సినిమా విడుదల అప్ డేట్ ఇవ్వనున్నారు మేకర్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular