fbpx
Wednesday, April 24, 2024
HomeMovie Newsవరుణ్ సందేశ్ 'ఇందువదన' హీరోయిన్ ఫస్ట్ లుక్

వరుణ్ సందేశ్ ‘ఇందువదన’ హీరోయిన్ ఫస్ట్ లుక్

VarunSandesh Induhuvadana LatestUpdate

టాలీవుడ్: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘హ్యాపీ డేస్సినిమాతో పరిచయం అయిన నటుడు వరుణ్ సందేశ్. తర్వాత కొత్త బంగారు లోకం సినిమాతో బ్యాక్ తో బ్యాక్ హిట్స్ సాధించాడు. ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్ లు సెట్ చేసుకున్నాడు కానీ హిట్ ల విషయంలో మాత్రం వెనకపడిపోయాడు. కాల క్రమంలో సినిమాలు తగ్గడంతో భార్య తో పాటు బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ‘ఇందువదన’ అనే కొత్త సినిమాతో కం బ్యాక్ అవుదామని చూస్తున్నాడు. ఈ సినిమాలో ఒక కొత్త లుక్ లో కనిపించనున్నాడు వరుణ్ సందేశ్. ఈ సినిమా ఫస్ట్ లుక్ చూసిన తర్వాత ఈ సినిమా ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ గా రూపొందినట్టు అర్ధం అవుతుంది.

ఇదివరకే ఈ సినిమా నుండి వరుణ్ సందేశ్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ రోజు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న హీరోయిన్ ‘ఫెర్నాజ్ శెట్టి’ ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది సినిమా టీం. ఒక ట్రైబల్ గర్ల్ గా ఈ సినిమాలో నటిస్తున్న ఫెర్నాజ్ లుక్ ఆకట్టుకుంది. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ ‘వాసు’ అనే ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. తన పోస్టింగ్ పడిన ఏరియా లో ఉండే ట్రైబల్ గర్ల్ గా ఉండే హీరోయిన్ ప్రేమలో పడే పాత్రలో నటించనున్నట్టు అర్ధం అవుతుంది. ఎం.ఎస్.ఆర్ అనే దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్ సమర్పణలో మాధవి ఆదుర్తి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా రిలీజ్ అప్ డేట్స్ ఇవ్వనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular