fbpx
HomeMovie Newsతమ హీరోయిన్ కనిపించడం లేదన్న నితిన్

తమ హీరోయిన్ కనిపించడం లేదన్న నితిన్

Nithin PromotingRangDeMovie beforeItsRelease

టాలీవుడ్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ లవ్ స్టోరీస్, యూత్ ఫుల్ సినిమాలు చేస్కుంటూ సక్సెస్ ఫేయిల్యూర్లతో ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఈ మధ్యనే చెక్ సినిమా విడుదల చేసి యావరేజ్ టాక్ సంపాందించుకుని ఈ వారం ‘రంగ్ దే’ సినిమాని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. నిన్ననే విడుదలైన సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ లభించింది. పూర్తి ఫామిలీ మరియు లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన రంగ్ దే మూవీ మార్చ్ 26 న థియేటర్లలో విడుదల అవనుంది. అయితే ప్రచారం మొదలు పెట్టిన సినిమా టీం కొత్త మార్గాల్లో ప్రయత్నిస్తుంది.

నిన్న ట్రైలర్ రిలీస్ ఫంక్షన్ లో కూడా తమ హీరోయిన్, తమ డైరెక్టర్ ప్రొమోషన్ లో పాల్గొనకపోయినా తనకు ఆడియన్స్ ఉన్నారు వాళ్ళ సపోర్ట్ ఉంది అని నితిన్ చెప్పాడు. ఈ రోజు ట్విట్టర్ లో తమ హీరోయిన్ కనపడుట లేదు అని కీర్తి సురేష్ చిన్నప్పటి పిక్ ఒకటి పెట్టి ఎక్కడ ఉన్నా రంగ్ దే ప్రొమోషన్ లో జాయిన్ అవ్వాలని ట్వీట్ పెట్టాడు. దీనికి బదులుగా హైదరాబాద్ పోలీస్ ట్విట్టర్ ద్వారా మేము చూసుకుంటాం అని కామెడీ గా రిప్లై ఇచ్చారు. ఏది ఏమైనా తమ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి సినిమా టీమ్స్ కొత్త కొత్త మార్గాలని వెతుక్కుంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular