టాలీవుడ్: యూత్ ఫుల్ సినిమాలు, లవ్ స్టోరీస్ తో హిట్లు కొడుతున్న నితిన్ ఫిబ్రవరి లో చెక్ అనే కొత్త తరహా సినిమాతో సినీ అభిమానుల్ని పలకరించాడు. ప్రస్తుతం ‘రంగ్ దే’ అనే మరో సినిమాని ఈ నెల చివర్లో విడుదల చేస్తున్నాడు. తొలిప్రేమ, మజ్ను లాంటి సినిమాలకి డైరెక్ట్ చేసిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో నితిన్ కి జోడీ గా మహానటి కీర్తి సురేష్ నటించింది. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ విడుదల చేసారు.
ట్రైలర్ స్టార్ట్ లో హీరో, హీరోయిన్ పాత్రల చిన్నప్పటి కథ నుండి స్టార్ట్ చేసి హీరో, హీరోయిన్ పిల్లల్ని కనే స్టేజ్ వరకు చూపిస్తారు. మామూలుగా హీరో హీరోయిన్ వెంబడి పడతాడు, కానీ ఈ సినిమాలో హీరోయిన్ హీరో వెంబడి పడటం, టీజ్ చేయడం ట్రైలర్, టీజర్ ని చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్, నితిన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ట్రైలర్ మొత్తం చూసాక ఒక పూర్తి అవుట్ అండ్ అవుట్ లవ్ అండ్ ఫామిలీ ఎంటర్టైనర్ చూడబోతున్నట్టు తెలుస్తుంది. ‘మనల్ని ప్రేమించే వాళ్ళు మనం వద్దు అనుకున్నప్పుడు కన్నా వాళ్ళు మనల్ని వద్దు అనుకున్నపుడు వారి విలువ మనకి తెలుస్తుంది’, ‘ఈ సారి గెలువడానికి ఫైట్ చేయడం కన్నా కలవడానికి ఫైట్ చేయి’ లాంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.
టెక్నిషియన్స్ లో సినిమాటోగ్రాఫర్ పి.సి. శ్రీరామ్ పని తనం ట్రైలర్ లో ప్రతి ఫ్రేమ్ లో కనపడుతుంది. ట్రైలర్ చూసాక ఒక కలర్ ఫుల్ ఫీస్ట్ చూడబోతున్నామని హింట్ ఇచ్చాడు. మ్యూజిక్ డైరెక్టర్ దేవి ఇచ్చిన సంగీతం ఆల్రెడీ సూపర్ హిట్ టాక్ తో నడుస్తుంది. ఈ సినిమాలో సీనియర్ హీరో నరేష్, వెన్నల కిషోర్, సుహాస్, అభినవ్ గోమఠం, రోహిణి తదితరులు నటించారు. మార్చ్ 26 ఈ సినిమా థియేటర్లలో విడుదల అవనుంది.