fbpx
Saturday, July 27, 2024
HomeMovie Newsమరొక మెలోడియస్ సాంగ్ తో వస్తున్న కాల భైరవ

మరొక మెలోడియస్ సాంగ్ తో వస్తున్న కాల భైరవ

MellagaMellagaLyrical ReleasedFrom TellavaritheGuruvaram

టాలీవుడ్: ప్రస్తుతం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ లు అందరూ తమని తాము నిరూపించుకుని టాప్ పొజిషన్ కి వెళ్ళడానికి శాయ శక్తులా ప్రయత్నిస్తున్నారు. అందునా ఒక సంగీత దర్శకుడి కుటుంబం నుండి వచ్చి తన లెగసీ ని నిలబెట్టడానికి ఈ కొత్త మ్యూజిషియన్ ఇంకా ఎక్కువగానే కష్టపడుతున్నట్టు అనిపిస్తుంది. కలర్ ఫోటో సినిమా ద్వారా మొదటి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందుకున్న కాల భైరవ ప్రస్తుతం తన తమ్ముడు నటిస్తున్న సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. శ్రీ సింహ హీరోగా రూపొందిన ‘తెల్లవారితే గురువారం’ అనే సినిమా నుండి మెల్లగా మెల్లగా అంటూ సాగే ఒక మెలోడియస్ సాంగ్ ని ఈ రోజు విడుదల చేసింది సినిమా టీం.

కీరవాణి కొడుకులు ఒక హీరోగా ఒకరు సంగీత దర్శకుడిగా ఈ సినిమాతో మరో మెట్టు ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పాటతో కాల భైరవ మరొక మంచి మెలోడీ సాంగ్ ని అందించాడు. వారాహి చలన చిత్రం మరియు లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మని కాంత్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాని రూపొందించాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 27 న విడుదల చేయబోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular