fbpx
HomeMovie Newsఅడవి శేష్ హీరోగా హిట్ సీక్వెల్

అడవి శేష్ హీరోగా హిట్ సీక్వెల్

Adavishesh GoingtoActIn HitMovieSequel

టాలీవుడ్: కరోనా కి కొంచెం ముందు ఫిబ్రవరి 2020 లో విడుదలై హిట్ సాధించిన సినిమా ‘హిట్’. నాని మరియు ప్రశాంతి నిర్మాణంలో విశ్వక్సేన్ హీరోగా రూపొందిన ఈ సినిమా హిట్ టాక్ తో నిలిచింది. ఓటీటీ లో కూడా మంచి వ్యూస్ దక్కించుకుంది. ఇంటర్రోగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో విశ్వక్సేన్ మెప్పించాడు. కొత్త దర్శకుడు శైలేష్ కొలను గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమా మొత్తం ఆకట్టుకున్నాడు. హిట్ ది ఫస్ట్ కేస్ అని విడుదలైన మొదటి పార్ట్ కి కొనసాగింపు గా ఇపుడు రెండవ పార్ట్ రాబోతుంది. కానీ ఈ సినిమాలో విశ్వక్ సేన్ కాకుండా వేరే హీరో నటించబోతున్నాడు.

గూఢచారి, క్షణం లాంటి సూపర్ సక్సెస్ లని థ్రిల్లర్ సినిమాల్లో తిరుగులేదు అనిపించుకుంటున్న అడవి శేష్, కెప్టెన్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ నేపధ్యం లో మేజర్ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే హిట్ -పార్ట్ 2 లో పాల్గొననున్నాడు. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ విడుదల చేసి పూజా కార్యక్రమాలతో సినిమాని ప్రారంభించారు. ఈ సినిమా కూడా శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి నిర్మాణంలో రూపొందుతుంది. కృష్ణ దేవ్ పాత్రలో అడవి శేష్ ని అలాగే ఇన్వెస్టిగేషన్ లో సహాయపడే స్నిఫర్ డాగ్ ని షాడో లో ఫస్ట్ లుక్ పోస్టర్ లో చూపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular