fbpx
Friday, May 3, 2024
HomeMovie Newsజూన్ లో నితిన్ 'అందాదున్'

జూన్ లో నితిన్ ‘అందాదున్’

Nithin AndhadhunRemake ReleaseDateAnnouncment

టాలీవుడ్: టాలీవుడ్ హీరో నితిన్ వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నాడు. ఈ నెలలో చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వం లో నితిన్ హీరోగా రూపొందిన ‘చెక్సినిమా విడులవుతుంది. మర్చి చివర్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన ‘రంగ్ దే’ సినిమా విడుదల అవుతుంది. వీటితో పాటు నితిన్ హిందీ లో సూపర్ హిట్ అయిన ‘అందాదున్’ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా విడుదల తేదీ కూడా ఈరోజు ప్రకటించాడు నితిన్. జూన్ 11 న ఈ సినిమా విడుదల అవబోతున్నట్టు తెలిపాడు.

‘వెంకటాద్రి ఎక్ష్ప్రెస్స్’, ‘ఎక్ష్ప్రెస్స్ రాజా’ లాంటి సినిమాలని డైరెక్ట్ చేసిన మేర్లపాక గాంధీ అందాదున్ రీమేక్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి నిర్మాణంలో తన సొంత బ్యానర్ లో నితిన్ ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో తమన్నా నటిస్తుంది, నితిన్ కి జోడీ గా నభ నటేష్ నటిస్తుంది. భీష్మ సినిమాకి సంగీతం అందించిన మహతి స్వర సాగర్ ఈ సినిమాతో మరో సారి నితిన్ కి సంగీతం అందించనున్నాడు. ఈ సినిమాతో కలిపి ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే నితిన్ నుండి మూడు సినిమాలు రాబోతున్నాయి. ఇవే కాకుండా చైతన్య కృష్ణ దర్శకత్వం లో ‘పవర్ పేట’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది కూడా ఈ సంవత్సరం చివర్లో విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular