fbpx
Thursday, May 2, 2024
HomeMovie Newsవాయిదా పడిన మరో సినిమా

వాయిదా పడిన మరో సినిమా

Nani TuckJagadeeshMovie Postponed

టాలీవుడ్: కరోనా కారణంగా మొన్నటి వరకు థియేటర్లు ఖాళీగా ఉండి దాదాపు 9 నెలలు అసలు ఇండస్ట్రీ మొత్తం వెలవెలబోయింది. ఈ సంవత్సరం ఆరంభం నుండి సినిమాలు విడుదలవడం, రెస్పాన్స్ కూడా బానే ఉండడం తో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచి మంచి కలెక్షన్స్ కూడా సాధించాయి. క్రాక్ నుండి మొన్న విడుదలైన వకీల్ సాబ్ వరకు విడుదలైన ప్రతీ సినిమాకి మంచి టాక్ వస్తే థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ వల్ల కేసులు బాగా పెరుగుతుండడం తో థియేటర్లకు వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ తగ్గిపోతారు అని కొన్ని సినిమాలు వాయిదా వేస్తున్నారు. ఈ వారం విడుదల అవ్వాల్సిన నాగ చైతన్య ‘లవ్ స్టోరీ‘ వాయిదా పడింది.

ఇపుడు మరో సినిమా కూడా వాయిదా వెయ్యబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. నాచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో రూపొందిన ‘టక్ జగదీశ్’ వచ్చే వారం విడుదల అవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమాని పోస్ట్ పోన్ చేయబోతున్నట్టు నాని తెలిపాడు. రేపు ఉగాది సందర్భంగా విడుదల చెయ్యాల్సిన ట్రైలర్ కూడా వాయిదా వేస్తూ ట్రైలర్ ఎపుడు విడుదల అవుతుందో అపుడే విడుదల తేదీ కూడా తెలియ చేస్తామని తెలిపారు. అంతే కాకుండా ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్రాల్లో సినిమాకి దక్కుతున్న ఆదరణకు తెలుగు ఆడియన్స్ కి హ్యాట్సాఫ్ అని తెలుగు ప్రజల్ని, సినిమాల్ని వేరు చేయలేము అని వీడియో ఒకటి విడుదల చేసాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular