టాలీవుడ్: అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి నటిస్తూ శేఖర్ కమ్ముల దర్శకత్వం లో రూపొందిన సినిమా ‘లవ్ స్టోరీ’. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు విడుదలైన టీజర్స్, పోస్టర్స్, సూపర్బ్ రెస్పాన్స్ తో ఆకట్టుకున్నాయి, ఇదే ఫ్లో లో సినిమా సూపర్ హిట్ అందుకుంటుందని అంతా ఎదురుచూసారు. కానీ అనుకోకుండా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమాని వాయిదా వేయాల్సి వస్తుంది. ఈ సినిమా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 16 న విడుదల అవ్వాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా వాయిదా వేస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా నిర్మాతలు , డైరెక్టర్ శేఖర్ కమ్ముల, హీరో నాగ చైతన్య ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని ధృవీకరించారు.
ఇది ఒక ఫామిలీ మూవీ అని, చాలా రోజుల తర్వాత అందరూ ఫ్యామిలీలతో వచ్చి ఎంజాయ్ చేస్తారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కుదరకపోవచ్చు. మళ్ళీ కరోనా విజృంభిస్తుండడం తో ఇలాంటి పరిస్థితుల్లో ఫామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడానికి ఇష్టపడరు, ఈ సినిమాని ఎక్కువ శాతం జనాల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తర్వాత పరిస్థితులు సెట్ అయిన తర్వాత మంచి డేట్ చూసుకుని రిలీజ్ చేస్తామని శేఖర్ కమ్ముల తెలియ చేసారు. ఈ సినిమాకి పవన్.ch అనే నూతన సంగీత దర్శకుడు ఇచ్చిన పాటలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అంతే కాకుండా చైతూ, సాయి పల్లవి కెమిస్ట్రీ కూడా ఈ సినిమాకి కలిసొచ్చే అంశం. అన్నీ కుదిరి వచ్చే వారం విడుదలై సూపర్ హిట్ అందుకుంటుందనుకుంటున్న ఈ సినిమా కరోనా కారణంగా మరోసారి వాయిదా పడాల్సి వస్తుంది.