fbpx
Thursday, December 12, 2024
HomeMovie Newsఅఖిల్ 'ఏజెంట్' ఫస్ట్ లుక్

అఖిల్ ‘ఏజెంట్’ ఫస్ట్ లుక్

AkhikAkkineni AgentMovie FirstLook

టాలీవుడ్: అక్కినేని వారసుడు అఖిల్ తన ఐదవ సినిమాని ప్రకటించాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన తన నాల్గవ సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్’ సినిమాని విడుదలకి సిద్ధం చేసి ప్రస్తుతం ఐదో సినిమా పనుల్లో మునిగిపోనున్నాడు. ఈ సినిమాలో అఖిల్ ఇంతవరకు టచ్ చెయ్యని సబ్జెక్టు ని ప్రయత్నించబోయాడు. మొదటి సినిమా అఖిల్ ప్లాప్ తర్వాత ఇప్పటివరకు యాక్షన్ ని ఎక్కువగా టచ్ చేయని అఖిల్ ఈ సారి యాక్షన్ మరియు స్పై థ్రిల్లర్ సబ్జెక్టు చేయబోతున్నాడు. ఈ రోజు అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది సినిమా టీం.

టైటిల్ కి తగ్గట్టే ఒక స్పై ఏజెంట్ లాగ అఖిల్ పని చేయనున్నట్టు పోస్టర్ ద్వారా తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఫిజిక్ పరంగా కూడా అఖిల్ కష్టపడుతున్నాడు. స్టైలిష్ మేకర్ గా పేరున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాతో అఖిల్ ని స్టార్ హీరోగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు సూరి. ఏ.కే. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ బ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఎప్పటిలాగే సురేందర్ సినిమాని వక్కంతం వంశీ కథ అందిస్తున్నాడు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నాడు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే సినిమా విడుదల తేదీ ని కూడా ప్రకటించింది సినిమా టీం. ఈ సంవత్సరం డిసెంబర్ 24 న సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular