fbpx
HomeMovie Newsకాలేజ్ గొడవల నేపథ్యంలో 'రౌడీ బాయ్స్'

కాలేజ్ గొడవల నేపథ్యంలో ‘రౌడీ బాయ్స్’

Introducing RowdyBoys MotionPoster

టాలీవుడ్: టాలీవుడ్ లో సినీ వారసులు వస్తూనే ఉన్నారు. హీరోల వారసులు మాత్రమే కాకుండా, హీరోయిన్ ల వారసులు, హీరోయిన్ ల బ్రదర్స్, నిర్మాతల వారసులు ఇలా చాలా మంది ఇండస్ట్రీ లో తమ టాలెంట్ ని ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న నిర్మాతల్లో టాప్ పొజిషన్ కోసం పోటీ పడుతున్న దిల్ రాజు తమ వారసుణ్ణి దింపుతున్నారు. దిల్ రాజు సహ నిర్మాత అయిన అతని సోదరుడు శిరీష్ రెడ్డి కుమారుడు ఆశిష్ హీరోగా పరిచయం అవుతూ ‘రౌడీ బాయ్స్’ అనే సినిమా రూపొందుతుంది. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన అనౌన్స్మెంట్ మరియు మోషన్ పోస్టర్ రిలీస్ చేసారు సినిమా టీం.

సినిమా మోషన్ పోస్టర్ లో కారెక్టర్లకి సంబందించిన లుక్ డైరెక్ట్ విడుదల చేయకుండా, కాలేజ్ నేపథ్యం లో జరిగే సినిమా అన్నట్టు చూపించారు. బ్యాక్ డ్రాప్ లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక మెడికల్ కాలేజ్ చూపించారు. పోస్టర్ ప్రకారం ఒక అమ్మాయి కోసం రెండు కాలేజ్ ల మధ్య ఉండే కుర్రాళ్ళ ఫైట్ అన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. పూర్తి కాలేజ్ ఫైట్స్ నేపథ్యంలో ఇదివరకు నితిన్ ‘సై’, నాగ చైతన్య ‘జోష్’ సినిమాలు వచ్చి మిశ్రమ ఫలితాలని సంపాదించాయి. ‘హుషారు’ సినిమాకి దర్శకత్వం వహించిన శ్రీ హర్ష కొనుగంటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో ఈ సినిమా రూపొందుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు,శిరీష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని జూన్ 25 న విడుదల చేయనున్నట్టు కూడా ప్రకటించారు నిర్మాతలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular