fbpx
Friday, November 8, 2024
HomeMovie Newsరెండోసారి కొరటాలతో రిపేర్లు చేయబోతున్న తారక్

రెండోసారి కొరటాలతో రిపేర్లు చేయబోతున్న తారక్

JuniorNTR MovieAnnouncementWith KoratalaSiva

టాలీవుడ్: టాలీవుడ్ లో ఇప్పుడున్న హీరోల్లో నటనా పరంగా , డైలాగ్ డెలివరీ పరంగా అందరికీ ఫెవరెట్ హీరో ఎవరంటే మెజారిటీ రెస్పాన్స్ జూనియర్ ఎన్ఠీఆర్ కి లభిస్తుంది. జూనియర్ ఎన్ఠీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాని ముగించే పనిలో ఉన్నాడు. ఈ సినిమా అవగానే అరవింద సమేత కాంబినేషన్ లో త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఒక సినిమా చేయనున్నట్టు ఇదివరకే ప్రకటన చేసారు. కానీ అనుకోకుండా ఆ సినిమా ఆగిపోయి సడన్ గా కొరటాల శివ తో సినిమా చేయబోతున్నట్టు ప్రకటన వచ్చింది. సినిమా ప్రకటించడమే కాకుండా విడుదల తేదీ కూడా ప్రకటించారు.

ప్రస్తుతం కొరటాల శివ చిరంజీవి తో కలిసి ‘ఆచార్య’ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మే లో విడులవబోతున్న ఈ సినిమా పూర్తవగానే కొరటాల శివ జూనియర్ ఎన్ఠీఆర్ తో కలిసి పని చేయనున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ‘జనతా గ్యారేజ్’ సినిమా రూపొంది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాని కళ్యాణ్ రామ్ సమర్పణలో యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఎన్ఠీఆర్ 30 వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాని ఈ రోజు ప్రకటించడమే కాకుండా ఏప్రిల్ 29 2022 న విడుదల చేయనున్నట్టు కూడా ప్రకటించి షాక్ ఇచ్చారు. ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ ‘లాస్ట్ టైం రిపేర్లు లోకల్ గా చేసాం.. ఈ సారి రిపేర్లు బౌండరీలు దాటిద్దాం’ అని పాన్ ఇండియా లెవెల్ సినిమా తీయబోతున్నట్టు హింట్ ఇచ్చాడు కొరటాల. ఈ సినిమా గురించి మరిన్ని టెక్నిషియన్స్ వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular