fbpx
HomeMovie Newsట్రెండింగ్ లో నాగార్జున 'వైల్డ్ డాగ్'

ట్రెండింగ్ లో నాగార్జున ‘వైల్డ్ డాగ్’

Nagarjung WildDogMovie TopTrendingInNetflix

టాలీవుడ్: అక్కినేని నాగార్జున చాలా గ్యాప్ తీసుకుని నటించిన సినిమా ‘వైల్డ్ డాగ్’. ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 2 న థియేటర్లలో విడుదలైంది. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కరోనా సెకండ్ వేవ్ కారణంగా అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ విడుదల వల్ల ఒక వారం తర్వాత థియేటర్లలోంచి దాదాపు కనుమరుగైంది.ఈ సినిమాని ఏప్రిల్ 22 నుండి నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో అందుబాటులో ఉంచారు.

ఓటీటీ లో విడుదలైన ఈ సినిమాకి విపరీతమైన ఆదరణ లభించింది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ వర్షన్ లలో అందుబాటులో ఉన్న ఈ సినిమా ప్రతీ భాషలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. నెట్ ఫ్లిక్స్ ఇండియా లో తెలుగు వెర్షన్ టాప్ 2 లో ఉండగా తమిళ వర్షన్ టాప్ 5 లో ఉంది. ఇండియా వైడ్ ఒక రీజనల్ సినిమాకి ఇంత గుర్తింపు రావడం ఇదే మొదటిసారి. కేవలం మన దగ్గరే కాకుండా అమెరికా, బ్రిటన్ , మలేషియా లాంటి సౌత్ ఆసియన్ దేశాల్లో సౌత్ ఇండియన్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రెండింగ్ లో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular