fbpx
Monday, April 29, 2024
HomeMovie Newsహిట్ కాంబో రిపీట్ చేయనున్న తమిళ స్టార్ హీరో

హిట్ కాంబో రిపీట్ చేయనున్న తమిళ స్టార్ హీరో

Dhanush Repeating KarnanCombination

కోలీవుడ్: అసలు హీరోగా పనికొస్తాడా అన్న స్టేజ్ నుండి ఆ హీరో సినిమా అంటే ఎదో ప్రత్యేకత ఉంటుంది అనే స్టేజ్ కి ఎదిగాడు తమిళ స్టార్ నటుడు ధనూష్. రెండు నేషనల్ అవార్డులు సాధించిన ఈ నటుడు హీరోగా ఏప్రిల్ 9 న ‘కర్ణన్’ అనే సినిమా విడుదలైంది.ఈ సినిమా కమర్షియల్ గానే కాకుండా క్రిటిక్స్ దగ్గరినుండి కూడా మంచి ప్రశంసలు లభించాయి. పరియేఱుమ్ పెరుమాళ్ లాంటి సినిమాని రూపొందించిన ‘మారి సెల్వరాజ్‘ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. మారి సెల్వరాజ్ ‘రా’ పిక్చరైజెశన్ బాగా నచ్చడంతో ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడికి ధనుష్ అవకాశం ఇచ్చాడు. దర్శకుడు కూడా అదే టేకింగ్ తో ‘కర్ణన్; సినిమా తీసి హిట్ సాధించాడు.

ఇపుడు ఇదే కాంబినేషన్లో మరో సినిమా చెయ్యబోతున్నందుకు సంతోషంగా ఉందని ధనూష్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కానీ ఇదివరకే షూటింగ్ మొదలైన సినిమాలు లైన్ లో ఉండడం తో 2022 చివర్లో ఈ సినిమా షూటింగ్ ఉండబోతుందని తెలిపారు. ధనూష్ నటించిన మరో సినిమా ‘జగమే తంత్రం’ అనే సినిమా ఓటీటీ లో విడుదలకి సిద్ధంగా ఉంది. అంతే కాకుండా బాల్కి దర్శకత్వంలో ఒక బాలీవుడ్ సినిమా మరియు మరో హాలీవుడ్ సినిమాలో ప్రస్తుతం ధనుష్ నటిసున్నాడు. వీటి తర్వాత తన అన్న ‘సెల్వ రాఘవన్’ దర్శకత్వంలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘యుగానికి ఒక్కడు 2 ‘ చేయనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular