fbpx
HomeMovie Newsకాజల్ అగర్వాల్ సమర్పణలో 'మను చరిత్ర'

కాజల్ అగర్వాల్ సమర్పణలో ‘మను చరిత్ర’

ManuCharitraMovie ConceptPoster Released

టాలీవుడ్: పెళ్ళైన తర్వాత కాజల్ అగర్వాల్ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టనున్నట్టు సంకేతాలు ఇస్తుంది. ప్రస్తుతం తెలుగు లో రూపొందుతున్న ఒక సినిమా కాజల్ అగర్వాల్ భాగస్వామ్యం లో నిర్మితమవుతుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ‘మను చరిత్ర’ అనే సినిమాకి సంబందించిన అనౌన్స్మెంట్ తో పాటు ఒక పోస్టర్ కూడా విడుదల చేసింది సినిమా టీం. పెళ్లి చూపులు నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి ఈ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. హీరోయిన్ గా మేఘా ఆకాష్ నటిస్తుంది. కాజల్ అగర్వాల్ సమర్పణలో ఆపిల్ ట్రీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎన్ శ్రీనివాస్ రెడ్డి మరియు పి రోన్సన్ జోసెఫ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

బండరాయి కట్టి నీటిలోకి వదిలేసిన ఒక వ్యక్తి లవ్ ఫెయిల్యూర్ కథ ఈ సినిమా అని తెలుస్తుంది. ఇంకా పోస్టర్ లో నన్ను వొదిలేసిన నా ఎక్స్-గర్ల్ ఫ్రెండ్స్ అందరికి వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు అని టాగ్ కూడా జత చేసారు. ప్రేమలో పడడం ఒక బాధాకరమైన ఆనందం అని థీమ్ లైన్ ని పోస్టర్ లో ప్రెసెంట్ చేసారు. భరత్ పేదగాని అనే నూతన దర్శకుడు ఈ సినిమాకి రచన మరియు దర్శకత్వం చేస్తున్నారు. గోపి సుందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular