fbpx
HomeTelanganaప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీగా మధుసూదనాచారి!

ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీగా మధుసూదనాచారి!

MADHUSUDHANACHARI-GOVERNOR-QUOTA-MLC-TAKES-OATH

హైదరాబాద్‌: తెలంగాణలో ఉన్న గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ గా ఇటీవలే నియమితులైన సిరికొండ మధుసూదన ఆచారి ఈ ఆదివారం రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌ చాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. మధుసూదన ఆచారి చేత తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ వెన్నవరం భూపాల్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.

కాగా ప్రమాణ స్వీకారానికి వెళ్ళే ముందు మధుసూదనాచారి హైదరాబాద్ గన్‌ పార్కులోని అమరవీరుల స్థూపాన్ని సందర్శించి అక్కడ నివాళులర్పించారు.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, శ్రీనివాస్‌ గౌడ్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular