fbpx
HomeMovie News'విక్రమ్' టైటిల్ టీజర్ తో అదరగొట్టిన కమల్

‘విక్రమ్’ టైటిల్ టీజర్ తో అదరగొట్టిన కమల్

KamalHasan LatestMovie VikramTitleTeaser

కోలీవుడ్: నటనకు, ప్రయోగాలకి, హావభావాలకి పెట్టింది పేరు కమల్ హాసన్. కమల్ హాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో ‘ఇండియన్ 2 ‘ సినిమా తో పాటు మరొక సినిమా చేస్తున్నాడు. ఈరోజు కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా ఆ సినిమా టీం టైటిల్ తో పాటు ఒక టీజర్ కూడా విడుదల చేసింది. కార్తీ నటించిన ‘ఖైదీ’ తో సూపర్ సక్సెస్ సాధించి ఓవర్ నైట్ పెద్ద డైరెక్టర్ అయిపోయిన ‘లోకేష్ కనగరాజ్‘ దర్శకత్వంలో కమల్ హాసన్ సినిమా చెయ్యబోతున్నాడు అనే విషయం తెలిసింది. ఈ రోజు ఆ సినిమా టైటిల్ ‘విక్రమ్’ అని తెలియ చేస్తూ ఒక టీజర్ కూడా విడుదల చేసారు.

టీజర్ లో ఒక ఫార్మ్ హౌస్ లాంటిది చూపించి అందులో కమల్ హాసన్ వంట వండుతూ తుపాకులాని, కత్తులని సిద్ధం చేస్తుంటాడు. ఆ ఇంటికి పోలీసులు, మినిస్టర్ లు, ఎంఎల్ఏ లు ఇలా రక రకాల ప్రొఫెషన్స్ లో ఉన్న వ్యక్తులు అతిధులు గా వస్తారు. వాళ్ళందరితో పాటు ఒకే టేబుల్ లో మధ్యలో కమల్ కూర్చొని భోజనానికి సిద్ధం అవుతారు. ముందు పెట్టిన ఆయుధాల్ని వాడుతూ వాళ్ళని చంపుతాడు.. చివర్లో ‘ONCE UPON A TIME THERE LIVED A GHOST ‘ (అప్పట్లో ఒక రాక్షసుడు ఉండేవాడు) అనే అర్ధం వచ్చేలా టీజర్ ముగించి టైటిల్ ‘విక్రమ్’ అని టీజర్ ముగించాడు.

టీజర్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి టెక్నికల్ అంశాలు. ఒక్కో షాట్ టెక్నికల్ బ్రిలియన్స్ తో పాటు టేకింగ్ కూడా అద్భుతంగా ఉంది. కమల్ హాసన్ హావా భావాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ ఐతే ఈ టీజర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. సినిమా ఒక వింటేజ్ కథ లాగ చూపించబోతున్నట్టు తెలుస్తుంది. మ్యూజిక్ కూడా వింటేజ్ కి తగ్గట్టుగా ఉన్నట్టే ఉండి కొత్తగా ఆకట్టుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular