fbpx
HomeAndhra Pradeshహైకోర్టు నుండి జేసీజే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌!

హైకోర్టు నుండి జేసీజే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌!

JUNIOR-CIVIL-JUDGES-NOTIFICATION-IN-ANDHRAPRADESH

అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్టుల భర్తీ కోసం మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం 68 పోస్టుల్లో 55 పోస్టులను ప్రత్యక్షంగా మరియు మిగిలిన 13 పోస్టులను అంతర్గత బదిలీల ద్వారా భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టులకు దరఖాస్తుల సమర్పణ చివరి తేదీ ఆగస్టు 20.

కాగా ఈనెల 20 నుంచి హైకోర్టు (https://hc.ap.nic.in/) వెబ్‌సైట్ లో దరఖాస్తులను అందుబాటులో ఉంచారు. కాగా రాత పరీక్షను సెప్టెంబర్‌ 26వ తేదీన నిర్వహించనున్నారు. సెప్టెంబర్ నెల 10వ తేదీ నుండి అభ్యర్థులు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

2020లోనే ఈ 68 జేసీజే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. కాగా ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు న్యాయవాదిగా మూడేళ్ల అనుభవం ఉండాలి అని నిబంధన విధించింది. అయితే ఆ నిబంధనను సవాలు చేస్తూ చాలా మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటీషన్లపై విచారణ జరిపిన కోర్టు, ఆ మూడు సంవత్సరలా అనుభవం ఉండాలన్న నిబంధన రాజ్యాంగ విరుద్ధమంటూ అప్పటి నోటిఫికేషన్‌ను కొట్టేసింది.

ఆ నోటిఫికేషన్ ను రద్దు చేసి తిరిగి కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆదేశాలు జారి చేసింది. అందువల్ల హైకోర్టు రిజిస్ట్రీ ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్‌ ఇచ్చింది. సదరు దరఖాస్తుని హైకోర్టు వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ దరఖాస్తును ఆగస్టు 20వ తేదీ రాత్రి 11.59 లోపు హైకోర్టుకు అందాల్సి ఉంటుంది.

ఈ పోస్ట్లకు దరఖాస్తులను కేవలం ఆన్‌లైన్‌లోనే పూర్తిచేసి సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులను ప్రత్యక్షంగా మరియు పోస్టు ద్వారా స్వీకరించరు. 2020లో జారీచేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన స్క్రీనింగ్‌ టెస్ట్‌కు హాజరైన అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు సమర్పించకుండానే ప్రస్తుతం నిర్వహించనున్న జేసీజే పరీక్షకు హాజరు అవడానికి అవకాశం కల్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular