fbpx
Sunday, April 28, 2024
HomeMovie Newsఓటీటీ లో మరో తమిళ్ మూవీ

ఓటీటీ లో మరో తమిళ్ మూవీ

Nayanatara Netrikan OTTRelease

కోలీవుడ్: కరోనా కారణంగా థియేటర్లు మూతపడి ఓటీటీల మార్కెట్ పెరగడంతో కొన్ని చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలు ఓటీటీ ల్లో విడుదలవుతున్నాయి. ముఖ్యంగా పెద్ద హీరోలు అయినా కూడా లో బడ్జెట్ లో రూపొందే మలయాళం సినిమాలు ఓటీటీ లలో ఎక్కువగా విడుదలవుతున్నాయి. ఈ మధ్య తెలుగు తమిళ భాషలు కూడా ఓటీటీ ల్లో విడుదలయ్యే సినిమాలని పెంచాయి. ఈ మధ్యనే తమిళ్ లో ధనుష్ నటించిన ‘జగమే తంత్రం’, ఆర్య నటించిన ‘టెడ్డీ’ సినిమాలు ఓటీటీల్లో విడుదలయ్యాయి. ఆర్య నటించిన మరో సినిమా ‘సర్పట్టా’ ఈ వారం ఓటీటీ లో విడుదలవనుంది. ఈ రోజు మరొక తమిళ్ సినిమా ఓటీటీ లో విడుదలవనున్నట్టు ప్రకటించారు.

నయనతార ముఖ్య పాత్రలో ‘నేత్రికాన్’ అనే సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో నయనతార ఒక అంధురాలి పాత్రలో నటిస్తుంది. కానీ ఈ పాత్ర ఒక క్రైమ్ కేసు ఇన్వెస్టిగేట్ చేయడం అనేది ఈ పాత్రలోని ఆసక్తి కలిగించే అంశం . ఇదే విషయాన్ని టీజర్ ద్వారా తెలిపారు. కళ్ళు కనిపించని ఒక అమ్మాయి ఒక మర్డర్ మిస్టరీ ని ఎలా ఛేదించింది అనే ఆసక్తికరమైన కథనం తో రూపొందిన ఈ సినిమా హాట్ స్టార్ ఓటీటీ లో విడుదల అవనున్నట్టు ప్రకటించారు. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై విగ్నేష్ శివన్ నిర్మాణంలో మిలింద్ రావు అనే దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ లో మరి కొద్దీ రోజుల్లో ఈ సినిమా విడుదల అవనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular