fbpx
HomeMovie Newsవిజయ్ 'మాస్టర్' టీజర్ విడుదల

విజయ్ ‘మాస్టర్’ టీజర్ విడుదల

IladalapathiVijay MasterMovie TeaserReleased

కోలీవుడ్: ఇళయదళపతి గా తమిళ అభిమానులు ఎక్కువగా పిలుచుకునే నటుడు ‘విజయ్‘. తెలుగులో ఇదివరకు అంతగా మార్కెట్ లేదు కానీ ‘తుపాకీ’, ‘స్నేహితుడు’ ద్వారా కొద్దిగా గుర్తింపు లభించింది. ఈ మధ్య వచ్చిన ‘అదిరింది’, ‘విజిల్’ సినిమాలు కూడా పర్వాలేదనిపించాయి. దీని తర్వాత విజయ్ కి కూడా ఇక్కడ మార్కెట్ కొద్దీ కొద్దిగా పెరుగుతుంది. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న సినిమా ‘మాస్టర్ ‘. కరోనా వల్ల విడుదల ఆలస్యం అవుతున్న పెద్ద సినిమాల్లో ఇది కూడా ఒకటి. దీపావళి సందర్భంగా ఈ సినిమా టీజర్ ని ఇవాల విడుదల చేసారు. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఒక టీచర్ గా విజయ్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. స్టైలిష్ కాలేజ్ డ్రామా మరియు యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందింది.

కార్తీ నటించిన ‘ఖైదీ’ సినిమా తో సూపర్ హిట్ సాధించిన లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ్ టాప్ మోస్ట్ పెరఫార్మెర్ విజయ్ సేతుపతి కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఈ సినిమాలో నటిస్తుండడం విశేషం. ఈ సినిమాలో విజయ్ కి జోడీ గా మాళవిక మోహనన్ నటిస్తుంది. టీజర్ ఆద్యంతం స్టైలిష్ గా ఆకట్టుకుంది. ఇద్దరు విజయ్ లకి మధ్య వచ్చే ఫేస్ టు ఫేస్ సీన్లు చాలా ఆసక్తి గా కనిపిస్తున్నాయి. టీజర్ లో చూపించిన టెక్నికల్ యాస్పెక్ట్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు. ఇదివరకే విడుదలైన ఈ సినిమా పాటలు సూపర్ హిట్ అయి ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ సినిమా విడుదల తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular