fbpx
Sunday, April 28, 2024
HomeMovie News'పుష్ప'రాజ్ ఆన్ లొకేషన్

‘పుష్ప’రాజ్ ఆన్ లొకేషన్

BunnyLook AsPushpaRaj FromPushpaMovie

టాలీవుడ్: ఈ ఏడాది ఆరంభంలో ‘అల వైకుంఠపురం లో ‘ సినిమా తో గ్రాండ్ సక్సెస్ అందుకొని తరువాతి సినిమాని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాతో మరో గ్రాండ్ సక్సెస్ అందుకొని తన స్టార్ డమ్ ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో 5 భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిన ఈ సినిమా షూటింగ్ కి కరోనా వల్ల మరో 6 నెలలు గ్యాప్ వచ్చింది. అయితే మొన్ననే షూటింగ్ మొదలుపెట్టింది ఈ సినిమా టీం. తూర్పు గోదావరి లోని మారేడుమల్లి అడవుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కోసం ఏర్పాట్లు చేసి అక్కడే ఎక్కువ శాతం షూటింగ్ చేస్తున్నారు.

షూటింగ్ లో పాల్గొన్న బన్నీ లుక్ ని వెనకనుండి చూపించారు ఈ సినిమా మేకర్స్. పుష్పరాజ్ వచ్చేసాడ్రోయ్ అంటూ గోదావరి స్లాంగ్ లో పోస్ట్ పెట్టారు. గంధపు చెక్కల స్మగ్గ్లింగ్ నేపథ్యంలో మరో ప్రయోగాత్మక పాత్రలో బన్నీ నటిస్తున్నాడు. ఈ సినిమాలో లారీ డ్రైవర్ పాత్రలో 80 ల నాటి కథలో బన్నీ అలరించనున్నాడు. ఈ సినిమాలో బన్నీ కి జోడిగా సక్సెస్ఫుల్ హీరోయిన్ రష్మిక నటించనుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు. బన్నీ, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ హ్యాట్రిక్ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular