fbpx
HomeMovie News'బ్రోచేవారెవరురా' డైరెక్టర్ తో నాని సినిమా

‘బ్రోచేవారెవరురా’ డైరెక్టర్ తో నాని సినిమా

NaturalStarNani MovieWith VivekAthreya

టాలీవుడ్: నాచురల్ స్టార్ నాని వరుసగా క్రేజీ ప్రాజెక్టులని లైన్ లో పెడుతున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం లో ప్రస్తుతం ‘టక్ జగదీశ్’ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే ‘టాక్సీ వాలా’ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింఘరాయ్’ అనే మరో సినిమాలో కూడా చేస్తున్నాడు. ఇంతలోనే మైత్రి మూవీ మేకర్స్ తో మరొక ప్రకటన వెలువడింది. నిన్న ఈ సినిమా గురించి ప్రకటించిన మేకర్స్ ఈరోజు పూర్తి వివరాలు తెలిపారు. ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ లాంటి సినిమాలు తీసి డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ‘వివేక్ ఆత్రేయ’ ఈ సినిమాతో నాని తో పని చేయబోతున్నాడు. ఈ అప్డేట్ ని బ్రోచేవారెవరురా హీరో ‘శ్రీ విష్ణు’ సోషల్ మీడియా లో ప్రకటించారు.

ఈ సినిమాతో నజ్రియా నజిమ్ తెలుగు లో పరిచయం అవుతుంది. ఇంతకముందు ‘రాజా రాణి’ సినిమా ద్వారా తెలుగు వారికి సుపరిచితమే అయిన కానీ డైరెక్ట్ తెలుగు లో మాత్రం ఇదే మొదటి సినిమా. నాని కెరీర్ లో 28 వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్ వారు నిర్మిస్తున్నారు. సినిమా టైటిల్ ని ఈ నెల 21 న ప్రకటించబోతున్నట్టు కూడా తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular