fbpx
HomeMovie News'ఓదెల రైల్వేస్టేషన్' - హెబ్బా ఫస్ట్ లుక్

‘ఓదెల రైల్వేస్టేషన్’ – హెబ్బా ఫస్ట్ లుక్

HebbahPatel FirstLookFrom OdelaRailwayStationMovie

టాలీవుడ్: ప్రముఖ దర్శకుడు ‘సంపత్ నంది’ క్రియేషన్ లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఓదెల రైల్వే స్టేషన్’. ఈ సినిమాకి సంపత్ నంది కథ, మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించనున్నారు. ఓదెల అనే గ్రామంలో జరిగే సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ గా ఈ సినిమా రూపోంతుంది. ఇందులో ఒక డి గ్లామర్ రోల్ లో హెబ్బా పటేల్ నటిస్తుంది. ఈ రోజు హెబ్బా కి సంబందించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు. రాధా అనే ఒక విల్లెజ్ పాత్రలో హెబ్బా పటేల్ నటిస్తుంది. ఇప్పటి వరకు కేవలం గ్లామర్ పాత్రల్లోనే నటించిన హెబ్బా పటేల్ ఈ సినిమాలో మొదటి సారి డి గ్లామర్ పాత్రలో నటించడం విశేషం.

సినిమాలో హెబ్బా పటేల్ తో పాటు కే జి ఎఫ్ నటుడు వశిష్ఠ సింహ, సాయి రోనాక్, నాగ మహేష్, పూజిత పొన్నాడ మరిన్ని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ చాలా కాలం తర్వాత ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. అశోక్ తేజ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular